Share News

ఎస్‌ఐఆర్‌పై ఢిల్లీలో బీజేపీ వర్క్‌షాప్‌

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:03 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌)పై ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన వర్క్‌షాప్‌కు తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలు హాజరయ్యారు.

ఎస్‌ఐఆర్‌పై ఢిల్లీలో బీజేపీ వర్క్‌షాప్‌

  • హాజరైన ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్‌)పై ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన వర్క్‌షాప్‌కు తెలంగాణ, ఏపీ బీజేపీ నేతలు హాజరయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ వర్క్‌షా్‌పకు తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, శశిధర్‌రెడ్డి, వేముల అశోక్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీఎన్‌ మాధవ్‌, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఏపీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌, మాలతీ రాణి, సురేంద్ర, జెల్లి మధుసూదన్‌ పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనేక రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ను నిర్వహించనుండటంతో ఒక రాజకీయ పార్టీగా ఎలా బాధ్యతగా వ్యవహరించాలో పార్టీ నేతలకు ఇందులో దిశానిర్దేశం చేశారు. 20 రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.

Updated Date - Mar 08 , 2026 | 06:05 AM