రేవంత్‌పై ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ ఫిర్యాదు
ABN , Publish Date - Jul 26 , 2026 | 06:11 AM
ఓటరు జాబితాలో పేరు లేకుంటే సంక్షేమ పథకాలు అందవంటూ సీఎం రేవంత్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
హైదరాబాద్, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో పేరు లేకుంటే సంక్షేమ పథకాలు అందవంటూ సీఎం రేవంత్ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. సీఎం హెచ్చరిక అభ్యంతరకరమని బీజేపీ ఎన్నికల వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన, సీఎం రేవంత్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పి.సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సీఎం రేవంత్‌కు నోటీసులు జారీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.