బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:43 AM
బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మొత్తం 199 మంది ఈ కార్యవర్గంలో ఉన్నారు.
జంబో కార్యవర్గంలో 199మందికి చోటు
హైదరాబాద్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మొత్తం 199 మంది ఈ కార్యవర్గంలో ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ శాశ్వత ఆహ్వానితులుగా(మొత్తం 20 మంది) కొనసాగనున్నారు. మాజీ కేంద్ర మంత్రులు, గవర్నర్‌లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు సిట్టింగ్ మున్సిపల్ ఛైర్మన్‌లు, సినీనటులు పసునూరి శ్రీనివాస్, డి. కవిత, లక్ష్మీకాంతరావు, జీవిత రాజశేఖర్, శివకృష్ణ (మొత్తం 62 మంది) రాష్ట్ర కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. మరో 116 మంది సీనియర్ నాయకులను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ప్రకటించారు.