Share News

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:52 AM

రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని, తాజాగా జరిగిన రెండు మునిసిపాలిటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు

  • ఆ రెండు మునిసిపాలిటీల ఫలితాలే నిదర్శనం: ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని, తాజాగా జరిగిన రెండు మునిసిపాలిటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఆయా మునిసిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులను ఆ రెండు పార్టీలూ పంచుకున్నాయని ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తుండబోదంటున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు.. ఖానాపూర్‌, ఇబ్రహీంపట్నంలలో ఏం జరిగిందో తెలియదా అని నిలదీశారు. తమకు ఎవరితోనూ పొత్తులు లేవంటూ బట్టలు చించుకున్న కేటీఆర్‌.. ఇప్పుడు కుక్కిన పేనులా పడున్నాడని విమర్శించారు. భవిష్యత్తులోనూ బీజేపీ-బీఆర్‌ఎస్‌ కలిసే పోటీ చేస్తాయని.. ఆ పార్టీలదీ ఫెవికాల్‌ బంధమని ఆయన అన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 04:52 AM