మా అభ్యర్థులకు మంత్రుల బెదిరింపులు
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:30 AM
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్...
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడండి
ఎస్‌ఈసీని కలిసిన రాంచందర్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) రాణి కుముదినికి ఫిర్యాదు చేశారు. మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ కార్యకర్తలను బెదిరించారని ఆరోపించారు. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య పోలీసు వ్యవస్థకే అవమానం అని అన్నారు. అక్కడి పోలీసులు ఎఫ్‌ఐఆర్ మార్చారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. మంగళవారం రాంచందర్‌రావు ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతిపత్రం అందజేసింది. బుధవారం పోలింగ్ నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని కోరినట్లు రాంచందర్‌రావు తెలిపారు. పోలింగ్ సందర్భంగా గొడవలు జరిగితే సీఎందే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.