సిద్దిపేట జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం?
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:26 AM
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు రంగనమైన కుమార్‌కు చెందిన పౌలీ్ట్రఫాంలో మంగళవారం.....
అందె గ్రామంలో 8 వేలకు పైగా కోళ్లు మృత్యువాత
తొగుట. మార్చి10 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు రంగనమైన కుమార్‌కు చెందిన పౌలీ్ట్రఫాంలో మంగళవారం 8 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.20లక్షల వరకు రైతుకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. పశుసంవర్ధక శాఖ అఽధికారులు, సిబ్బందితో కలిసి పౌలీ్ట్రఫాంకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. వైరస్‌వ్యాప్తి చెందకుండా చనిపోయిన కోళ్లను గుంతలు తీసి పూడ్చి పెట్టించారు. బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోయాయనే వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కొక్కెర వ్యాధితో కోళ్లు చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సంతోష్ చెప్పారు.