Share News

Bihar Teachers Assigned Responsibility to Count Stray Dogs: బిహార్‌లో టీచర్లకు వీధికుక్కల లెక్కింపు బాధ్యతలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:45 AM

బిహార్‌లోని ఓ మునిసిపాలిటీలో పరిధిలో ఉపాధ్యాయులకు వీధి కుక్కలను లెక్కించే బాధ్యతలు సర్కారు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.

Bihar Teachers Assigned Responsibility to Count Stray Dogs: బిహార్‌లో టీచర్లకు వీధికుక్కల లెక్కింపు బాధ్యతలు

  • ససారం మునిసిపాలిటీ పరిధిలో అప్పగింత..

పట్నా, జనవరి 7: బిహార్‌లోని ఓ మునిసిపాలిటీలో పరిధిలో ఉపాధ్యాయులకు వీధి కుక్కలను లెక్కించే బాధ్యతలు సర్కారు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే తమకు సంబంధం లేని ఎన్నికల విధులు, కులగణన సర్వే, జనాభా లెక్కలు తదితరాలకు వాడుకుంటున్నారని.. కొత్తగా కుక్కల లెక్కింపు బాధ్యతలు కూడా ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ససారంలో మునిసిపాలిటీ పరిధిలో వీధి శునకాలకు సంబంధించిన డేటాను సేకరించేందుకు అన్ని పాఠశాలల నుంచి ఒక్కో టీచర్‌ను నోడల్‌ అధికారిగా నియమించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆ టీచర్లు పనిచేసే బడి ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లోని వీధి కుక్కల సంఖ్య, వాటి పరిస్థితి, వాటి నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలపై నివేదించాలని వెల్లడించింది.

Updated Date - Jan 08 , 2026 | 03:45 AM