Share News

బీసీలకే పెద్దపీట....

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:49 PM

మునిసిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు వెనుకబడ్డ కులస్థులు (బీసీల)కు పెద్దపీట వేశాయి. జనాభాలో అధిక భాగం ఉన్న ఆయా కులస్థులకు అదే స్థాయిలో టిక్కెట్లు కేటాయించాయి.

బీసీలకే పెద్దపీట....

-మునిసిపల్‌ ఎన్నికల్లో వారికే టిక్కెట్లు

-జనరల్‌ స్థానాల్లో అధిక శాతం కేటాయింపు

-కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలదీ అదే ఒరవడి

-రాజ్యాధికారానికి నాందిగా భావిస్తున్న బీసీలు

మంచిర్యాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు వెనుకబడ్డ కులస్థులు (బీసీల)కు పెద్దపీట వేశాయి. జనాభాలో అధిక భాగం ఉన్న ఆయా కులస్థులకు అదే స్థాయిలో టిక్కెట్లు కేటాయించాయి.

రాష్ట్రంలో నెలకొన్న బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రె స్‌ ప్రభుత్వం ముందడుగు వేయడంతో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు ఆంక్షలతో తన ని ర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అందుకు ప్రత్యామ్నా యంగా ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం వరకు బీసీలకు సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రక టించారు. ఈ నేపథ్యంలో మొన్నటి పంచాయతీ ఎన్ని కల్లో బీసీలకు సీట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పించగా, ప్రస్తుత మునిసిపల్‌ ఎలక్షన్లలోనూ సింహ భాగం టికెట్లు బీసీలకే కేటాయించారు. ఈ మేరకు జనరల్‌ కేటగరీ కింద కేటాయించిన మొత్తం నుంచి బీసీలకు అవకాశం కల్పించారు. దీంతో బీఆర్‌ఎస్‌, బీజే పీలు సైతం అదే దారిన నడవాల్సి వచ్చింది. ఆ రెండు పార్టీలు కూడా సగానికిపైగా సీట్లను ఆయా కులస్థులకు కేటాయించాయి.

రాజ్యాధికారానికి నాంది...

మునిసిపల్‌ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు పెద్దపీట వేయడంతో ఆయా కులస్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీల నిర్ణయాన్ని బీసీలు రాజ్యాధికారానికి నాందిగా భావిస్తు న్నారు. చట్ట సభల్లో బీసీల ప్రాతినిథ్యం కోసం దశాబ్దా లుగా ఆ కులస్థులు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. అందు కోసం బీసీలు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, కార్యా చరణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో మంచి ర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు మూడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. వాటి పరిధిలోని మంచిర్యాల కార్పొ రేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెపే ట మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా బల్దియాల పరిధిలో మొత్తం 149 వార్డులు ఉండగా, వా టిలో సగభాగానికిపైగా అన్ని పార్టీలు బీసీలకు టిక్కెట్లు కేటాయించాయి. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో చెన్నూరు, బెల్లంపల్లి షెడ్యూల్‌ కులాలకు కే టాయిస్తుండగా, మంచిర్యాల జనరల్‌కు రిజర్వ్‌ అవుతూ వస్తోంది. దీంతో మంచిర్యాల నియోజక వర్గంలో అనా దిగా అగ్ర కులాలకు చెందిన వారు పదవుల్లో కొన సాగుతున్నారు. ప్రస్తుత మునిసిపల్‌ ఎన్నికల్లో మంచి ర్యాల కార్పొరేషన్‌ బీసీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో ఆ కులస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తం గా పెద్ద మొత్తంలో ఓటు బ్యాంకు కలిగిన బీసీల సం ఖ్యకు అనుగుణంగా ఆయా పార్టీల ముఖ్య నేతలు కూడా జనరల్‌ స్థానాల్లో బీసీలకు టికెట్లు కేటాయించారు.

కార్పొరేషన్‌లో అధికంగా సీట్లు...

మునిసిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని మంచి ర్యాల కార్పొరేషన్‌లో పెద్ద మొత్తంలో బీసీలకు టికెట్లు దక్కాయి. కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా, వాటిలో 40కిపైగా స్థానాలను బీసీలకే కేటాయించడం గమనార్హం. దాదాపు 65 శాతం వరకు బీసీలకు సీట్లు ప్రధాన పార్టీలు సీట్లు కేటాయించాయి. సుప్రీం కోర్టు రూలింగ్‌ మేరకు ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించగా, మిగతా సీట్లను జ నరల్‌కు రిజర్వ్‌ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్‌ పరి ధిలో ఎస్టీకి 1, ఎస్సీకి 9, బీసీ 20, జనరల్‌ 30 స్థానా లను కేటాయించారు. బీసీకి రిజర్వ్‌ చేసిన 20 స్థానా లతోపాటు జనరల్‌ విభాగంలో మరో 20 పై చిలుకు సీట్లు ఆయా కులస్థులకు దక్కాయి. ఇందులో కాంగ్రెస్‌ 41 సీట్లు బీసీలకు కేటాయించగా, బీఆర్‌ఎస్‌ 43, బీజేపీ 42 స్థానాలను వెనుకబడ్డ కులస్థులకు కేటాయించాయి.

మునిసిపాలిటీల వారీగా బీసీ సీట్లు....

జిల్లాలోని మునిసిపాలిటీల వారీగా బీసీలకు కేటా యించిన సీట్ల సంఖ్య ఇలా ఉంది.

మునిసిపాలిటీ వార్డులు బీసీ రిజర్వేషన్‌ కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ

మంచిర్యాల 60 20 41 43 42

బెల్లంపల్లి 34 06 17 16 09

చెన్నూర్‌ 18 05 12 10 11

క్యాతన్‌పల్లి 22 03 11 11 09

లక్షెట్టిపేట 15 03 08 09 09

Updated Date - Feb 06 , 2026 | 11:49 PM