అభివృద్ధి పనులకు భూమి పూజ
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:04 PM
మండల పరిధిలోని జిన్‌కుంట గ్రా మంలోమంగళవారం పలు అభివృద్ధి పనులకు అచ్చం పేట ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమి పూజ చేశారు.
- ఎమ్మెల్యే వంశీకృష్ణ
బల్మూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని జిన్‌కుంట గ్రా మంలోమంగళవారం పలు అభివృద్ధి పనులకు అచ్చం పేట ఎమ్మెల్యే వంశీకృష్ణ భూమి పూజ చేశారు. జి న్‌కుంట గ్రామంలో అచ్చం పేట-తెలకపల్లి ప్రధాన రహదారి అంబేడ్కర్ చౌరస్తా నుంచి గ్రామంలోని గాంధీ విగ్రహం వరకు రూ.55లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణానికి రూ. 12లక్షలతో భూమి పూజ చేశారు. స్థానిక ఎస్‌ఐ రాజేందర్ ప్రవేశ పెట్టిన రోడ్డు భద్రత మాసోత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొ ని మాట్లాడారు. ప్రతీ వాహనదారుడు హెల్మె ట్, సీటు బెల్టు సీటు ధరించి నడపాలని కోరా రు. అనంతరం వినుకొండ మైసమ్మ ఆలయా న్ని, ఆ పక్కనే ఉన్న దర్గాను ఎమ్మెల్యే సంద ర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో జిన్ కుంట గ్రామ నాయకులు కృష్ణయ్య, శివ, కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల సర్పం చ్‌లు పాల్గొన్నారు.
రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ
అచ్చంపేట, (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ ప్రజా భవన్‌లో నియోజకవర్గంలోని అన్ని మం డలాల రైతులకు 50శాతం రాయితీపై వ్యవ సాయ యంత్ర పరికరాలు, రోటవేటర్, పెట్రో లు పంపులు, ఇతర వ్యవసాయోపకరణాలను మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి మరో 100 రోటవేటర్లు, 100 పవర్ స్ర్పేయర్లు మంజూర య్యాయని, ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసు కోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవ సాయా ధికారులు కృష్ణయ్య, నరేష్, మహేష్, రమేష్, అనిల్, ప్రియదర్శిని, నాయకులు పాల్గొన్నారు.