kumaram bheem asifabad- ఘనంగా భీమన్న దేవర జెండా పండగ
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:17 PM
బెజ్జూరు మండల కేంద్రంతో పాటు ముంజంపల్లి, బారెగూడ గ్రామాల్లో గురువారం ఆదివాసీ కోలావార్, మన్నెవార్ల సంఘం ఆధ్వర్యంలో భీమన్న దేవర జెండా పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు.
బెజ్జూరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండల కేంద్రంతో పాటు ముంజంపల్లి, బారెగూడ గ్రామాల్లో గురువారం ఆదివాసీ కోలావార్, మన్నెవార్ల సంఘం ఆధ్వర్యంలో భీమన్న దేవర జెండా పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్, ఎంఈవో సునీత, ఎస్సై సర్తాజ్ పాషా, సర్పంచ్‌లు సరోజ, బానయ్య, ఉప సర్పంచ్ ఆదర్శ, నాయకులు అమీరుద్దీన్, సతీష్, పెంకటేష్, పెంటయ్య, పొన్నాజీ, తిరుపతి, జాకీర్, నీరజ తదితరులు పాల్గొన్నారు.
దహెగాం (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంతో పాటు హత్తిని, కుంచవెల్లి, చంద్రపల్లి, లగ్గాం, బీబ్రా, పార్వతిపేట, చిన్న అయినం గ్రామాల్లో గురువారం ఆదివాసీ కోలావార్ మన్నెవార్ సంఘం ఆధ్వర్యంలో భీమదేవర జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సుధాకర్, సర్పంచ్ జయలక్ష్మి, మల్లేష్, సత్తన్న, రోషన్, రోహిత్, ధనుంజయ్, రమేష్, చందుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కౌటాల (ఆంధజ్యోతి): ఆదివాసీలులు ఐక్యతను చాటి చెప్పాలని ఆదివాసీ మన్నెవార కోలావార్ రాష్ట్ర అధ్యక్షుడు బాపు అన్నారు. గురువారం చింతలమానేపల్లి మండలంలో బీమన్న దేవర జెండా పండగను ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ల క్రితం ఎస్టీ జాబితాలో ఉన్న ఆదివాసీ మన్నెవార్లను ఎస్సీల్లో చేర్చే ప్రయత్నాలు జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా మన్నెవార్లంతా ఏకమై ఉద్యమం చేయడంతో మళ్లీ తమ జాతిని ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రమోద్, ఎస్సై చంద్రశేఖఱ్, సరపంచ శంకర్‌్, వెంకటేష్, నాయకులు గోపాల్, రాజు, సత్తయ్య, బాపు, భీమన్న, రవీందర్‌గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి) (ఆంధ్రజ్యోతి): సిర్పూర్(టి) మండల కేంద్రంలో ఆదివాసీ కోలావార్ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి భీమన్న ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు భిక్షపతి, భీమయ్య, అశోక్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.