Share News

ఘనంగా భీమా కోరేగావ్‌ విజయ్‌ దివస్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:40 PM

జిల్లాలోని ప లు ప్రాంతాల్లో శౌర్యభీమా కోరేగావ్‌ విజయ ది వస్‌ వేడుకలు జరుపుకున్నారు.

ఘనంగా భీమా కోరేగావ్‌ విజయ్‌ దివస్‌
కల్వకుర్తి : భీమా కోరేగావ్‌ విజయ్‌ దివస్‌లో నాయకులు

కల్వకుర్తి/ నాగర్‌కర్నూల్‌టౌన్‌/ అచ్చంపేట టౌన్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప లు ప్రాంతాల్లో శౌర్యభీమా కోరేగావ్‌ విజయ ది వస్‌ వేడుకలు జరుపుకున్నారు. 1818 సంవత్స రం జనవరి 1న భీమా నది ఒడ్డున భీమా కోరే గావ్‌ గ్రామం వద్ద 28వేల పీశ్వసైనాన్ని 500 మహర్‌ సైన్యం సైన్యాధ్యక్షుడు శిఖనాక్‌ ఆధ్వ ర్యంలో కులవివక్ష వ్యతిరేకంగా విరోచితంగా పో రాడి విజయం సాధించారని నాయకులు అన్నారు.

కల్వకుర్తి మండలం ఎల్లికల్‌ గ్రామంలో గురు వారం ఫూలే, అంబేడ్కర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ జిల్లెల పద్మయాదవ్‌, ఉప స ర్పంచ్‌, వార్డు మెంబర్లు, నాయకులు, గ్రామస్థు లు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌ పట్టణంలో అంబే డ్కర్‌ ఐడియాలజీ మిషన్‌ ఆధ్వ ర్యంలో గురువారం అంబేడ్కర్‌ చౌ రస్తాలో ఏర్పాటు చేసిన భీమా కో రేగావ్‌ విజయ్‌ స్తూపం చిత్ర పటా నికి మిషన్‌ అధ్యక్షుడు టి.మద్దిలే టి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఐడి యాలజీ మిషన్‌ సభ్యులు మద్దిలేటి, కృష్ణయ్య, గోవర్దన్‌, సుబ్బయ్య, ఆర్‌.శ్రీనివాస్‌, వెలుగొండ వెంకటస్వామి, ఈశ్వర్‌, తిరుపతయ్య, సింగోటం, యాపట్ల వెంకటస్వామి, సత్యం, శివశంకర్‌, నాయిని వెంకటయ్య, మహమూద్‌ పాల్గొన్నారు.

అచ్చంపేట పట్టణంలో భీమాకోరేగావ్‌ విజ య్‌ దివస్‌ను సమతా సైనిక్‌దళ్‌ అధ్వర్యంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. 1927లో అంబేడ్కర్‌ అక్కడ నిర్మించిన మహర్‌ వీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారన్నారు. కార్యక్రమంలో ప్రజావైద్యులు డాక్టర్‌ చైతన్య, సభ్యులు ఆంజనేయులు, వెంక టేష్‌, నిరంజన్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 11:41 PM