Share News

కేటీఆర్‌.. మహిళలపై చిన్న చూపు తగదు: భట్టి

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:07 AM

కేటీఆర్‌ దారితప్పుతున్నారు.. మహిళలపై చిన్నచూపు తగదు.. మీ ఇంట్లోని ఆడబిడ్డపై మీకు ఏరకమైన గౌరవం ఉన్నదో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు...

కేటీఆర్‌.. మహిళలపై చిన్న చూపు తగదు: భట్టి

‘కేటీఆర్‌ దారితప్పుతున్నారు.. మహిళలపై చిన్నచూపు తగదు.. మీ ఇంట్లోని ఆడబిడ్డపై మీకు ఏరకమైన గౌరవం ఉన్నదో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈమేరకు అసెంబ్లీలో కేటీఆర్‌ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘రెండున్నరేళ్లలో మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని చెబుతుంటే ఎందుకు ఎద్దేవా చేస్తున్నారు? మహిళలు ఆత్మగౌరవంతో బతికితే తప్పా? ఆర్థికంగా ఎదిగితే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? ఎందుకు చులకనగా మాట్లాడుతున్నారు? ప్రభుత్వ సాయంతో మహిళలు ఎదుగుతుంటే ఎందుకు కించపరుస్తున్నారు? కోట్లాది మంది మహిళల మనసులు ఎందుకు గాయపరుస్తున్నారు?’ అని భట్టి ప్రశ్నించారు. మహిళలను అబాసుపాలు చేయటం మానుకుని గౌరవించటం నేర్చుకోవాలని సూచించారు. మహిళల తరఫున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తోందని, ఐదేళ్లలో లక్ష కోట్ల టార్గెట్‌ పూర్తిచేస్తామని భట్టి అన్నారు. ‘కేసీఆర్‌ ఇచ్చిన హామీలు గత పదేళ్లలో అమలుచేయలేదు. దళితుడిని సీఎం చేస్తామనే హామీ ఏమైంది? దళితులకు మూడెకరాల చొప్పున భూమిని పంచారా? పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లిచ్చారా?’ అని భట్టి ప్రశ్నించారు.

Updated Date - Mar 18 , 2026 | 05:07 AM