Share News

ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పనులను త్వరగా పూర్తి చేయండి: భట్టి

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:14 AM

డిసెంబరు 7, 8, 9 తేదీలలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ కోసం ఏర్పాటైన వివిధ కమిటీలు పనులను సమన్వయంతో త్వరితగతిన పూర్తిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.

ఇన్వెస్ట్‌ తెలంగాణ’ పనులను   త్వరగా పూర్తి చేయండి: భట్టి
batti vikramarka

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): డిసెంబరు 7, 8, 9 తేదీలలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’ కోసం ఏర్పాటైన వివిధ కమిటీలు పనులను సమన్వయంతో త్వరితగతిన పూర్తిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహణ కోసం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వార్‌రూమ్‌ను శుక్రవారం ఆయన సందర్శించి సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ఠను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - Oct 10 , 2026 | 06:14 AM