అర్హులైన వారి ఓట్లు రద్దు కానివ్వొద్దు
ABN , Publish Date - Jul 06 , 2026 | 03:15 AM
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సర్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి
సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ శ్రేణులకు భట్టి దిశానిర్దేశం
హైదరాబాద్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ ‘‘రాబోయే ఎన్నికల దృష్ట్యా సర్ ప్రక్రియలో... ఓటరు జాబితాలో అన్ మ్యాపింగ్, సాంకేతిక లోపాలు, ఇంటి పేర్ల మార్పులు, స్పెల్లింగ్ తప్పులు వంటివి లేకుండా బీఎల్‌ఓలతో కలిసి డివిజన్ స్థాయి నాయకులు పర్యవేక్షించాలని అన్నారు. అర్హత ఉన్న వారందరూ ఓటరుగా నమోదయ్యేలా పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లోని సానుకూలతను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని కార్యకర్తలకు భట్టి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను, సంక్షేమ కార్యక్రమాలను, రూ.40 వేల కోట్లతో చేపట్టిన నగరాభివృద్థి కార్యక్రమాలను ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో రూ.40వేల కోట్లతో చేపడుతున్న రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాల గురించి వివరించాలన్నారు. ఫీజు బకాయిల చెల్లింపుతో పాటు, నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే నగదు జమ చేేసందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వర్తింపచేయబోతున్నామని పేర్కొన్నారు. ‘‘ప్రతి బూత్ ఇన్‌చార్జి తన పరిధిలోని ప్రజలతో మమేకమై చిన్న చిన్న సమస్యలైనా సరే వెంటనే పరిష్కరిేస్త ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది’’ అని భట్టి సూచించారు.. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.