Share News

మధు పార్క్‌ రిడ్జ్‌ వాసులకు న్యాయం చేస్తాం: భట్టి

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:10 AM

మధు పార్క్‌ రిడ్జ్‌ అపార్టుమెంటు వాసులకు న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారికి భరోసానిచ్చారు. మధు పార్క్‌ రిడ్జ్‌ ఏ-బ్లాక్‌ నిర్వాసితులు ప్రజాభవన్‌లో ..

మధు పార్క్‌ రిడ్జ్‌ వాసులకు న్యాయం చేస్తాం: భట్టి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మధు పార్క్‌ రిడ్జ్‌ అపార్టుమెంటు వాసులకు న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారికి భరోసానిచ్చారు. మధు పార్క్‌ రిడ్జ్‌ ఏ-బ్లాక్‌ నిర్వాసితులు ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సోమవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. అభివృద్ధి పనులపై తమకెలాంటి అభ్యంతరం లేదని అందులో తమను భాగస్వాములను చేయాలని, తమకు పునరావాసం కల్పించాలని భట్టిని కోరారు. పునరావాస ప్రతిపాదనలను మానవీయ కోణంలో పరిశీలించి, న్యాయం చేస్తామని వారికి భట్టి భరోసా ఇచ్చారు.

Updated Date - Apr 14 , 2026 | 05:10 AM