Share News

విపత్తు కాలంలో ‘భరోసా’..

ABN , Publish Date - Sep 24 , 2026 | 01:23 AM

ఎల్‌నినో విపత్తు కాలంలో ఖరీఫ్‌ సాగులో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సమృద్ధిగా వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గిపోతున్న దశలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొద్దిపాటి వర్షాలకు ఎన్నో ఆశలతో ఖరీఫ్‌ సాగు చేసారు. అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలు పంటల దిగుబడిపై రైతులకు కొంత ఆశలు

విపత్తు కాలంలో ‘భరోసా’..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఎల్‌నినో విపత్తు కాలంలో ఖరీఫ్‌ సాగులో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సమృద్ధిగా వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గిపోతున్న దశలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొద్దిపాటి వర్షాలకు ఎన్నో ఆశలతో ఖరీఫ్‌ సాగు చేసారు. అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలు పంటల దిగుబడిపై రైతులకు కొంత ఆశలు కల్పిస్తున్న దశలో ప్రభుత్వ అందిస్తున్న రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో రైతులకు కొంత ఊరటగా మారింది. యాసంగిలో చేసిన పెట్టుబడి అప్పులకు భరోసా సాయం కరిగిపోయింది. యాసంగి సీజన్‌ మాదిరిగానే విడతలుగా భరోసా సాయం ఖరీఫ్‌లోను విడుదల చేస్తున్నారు. ఎల్‌నినో విపత్తు సమయంలో రైతులకు ప్రభుత్వం అందించే ఎకరానికి రూ.6 వేల పెట్టుబడి ఊరట ఇస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ సంబంధించి మొదటి విడుతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 142095 మంది రైతులకు రూ 154.37 కోట్ల భరోసా నిధులు విడుదల చేసింది. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 2.48 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం పెట్టుకున్నప్పటికీ 2.23 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా వరి 1.47 లక్షల ఎకరాలు, పత్తి 50275 ఎకరాలు, మొక్కజొన్న 4500 ఎకరాలు, కంది 2800 ఎకరాలు, ఇతర పంటలు 18646 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి సాగులో ఇప్పటివరకు గంభీరావుపేటలో 15554 ఎకరాల్లో నాట్లు వేసుకోగా ఇల్లంతకుంటలో 18600 ఎకరాలు, ముస్తాబాద్‌లో 18273 ఎకరాలు, సిరిసిల్లలో 3910 ఎకరాలు, తంగళ్లపల్లిలో 16600 ఎకరాలు, వీర్నపల్లిలో 5219 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 16363 ఎకరాలు, బోయినపల్లిలో 11836 ఎకరాలు, చందుర్తిలో 12800 ఎకరాలు, కోనరావుపేటలో 15200 ఎకరాలు, రుద్రంగిలో 2350 ఎకరాలు, వేములవాడలో 3300 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 8212 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి సాగు గంభీరావుపేటలో 120 ఎకరాలు, ఇల్లంతకుంటలో 12750 ఎకరాలు, ముస్తాబాద్‌లో 1050 ఎకరాలు, సిరిసిల్లలో 700 ఎకరాలు, తంగళ్లపల్లిలో 1400 ఎకరాలు, వీర్నపల్లిలో 450ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 3300 ఎకరాలు, బోయినపల్లిలో 720ఎకరాలు, చందుర్తిలో 6500 ఎకరాలు, కోనరావుపేట 5100 ఎకరాలు, రుద్రంగిలో 2230 ఎకరాలు, వేములవాడలో 5200 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 4300 ఎకరాల్లో సాగు చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను రైతులకు ఏర్పడకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రైతు భరోసా పేరుతో అమలు చేస్తున్న సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి సాగు పనులు కొనసాగుతున్న దశలోనే మొదటి విడత నిధులు విడుదల చేశారు.

యాసంగిలో రెండు విడతల్లో రూ.154.34 కోట్ల పెట్టుబడి సాయం

నిత్యం అనేక ఒడిదుడుకుల మధ్య భూ తల్లి ఒడిలో బతుకు పోరాటం చేస్తున్న అన్నదాతలకు ఆసరాగా ఉన్న రైతు భరోసా పెట్టుబడి సాయం నిధులు విడుదలయ్యాయి. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి మొదటి విడతగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 13 మండలాల్లో 175 రెవెన్యూ గ్రామాల్లో 142095 మంది రైతులకు రూ.154 కోట్ల 37 లక్షల 19 వేల 627 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఇప్పటికే 128048 మంది రైతులకు రూ.149 కోట్ల 49 లక్షల 46వేల 913 ఖాతాల్లో జమవుతున్నాయి. ఇందులో 23555 మంది ఎస్సీ రైతులకు రూ.18.74 కోట్లు, 8128 మంది ఎస్టీ రైతులకు రూ.8.62 కోట్లు, ఇతర రైతులు 110412 మంది రైతులకు రూ.127 కోట్ల భరోసా డబ్బులు జమ అవుతున్నాయి. గడిచిన యాసంగి, వానాకాలం సీజన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.2299.57 కోట్లు జమ చేశారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్‌లో 99464 మంది రైతులకు 133837.06 ఎకరాలకు రూ.80 కోట్ల 30 లక్షల 22455 జమ చేశారు. 2025 సంవత్సరం వానాకాలం సీజన్లో 126278 మంది రైతులకు 248857.15 ఎకరాలకు సంబంధించి రూ.149 కోట్ల 27 లక్షల 47573 రైతుల ఖాతాలో చేశారు. గడిచిన యాసంగి, వానాకాలం సీజన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.2299.57 కోట్లు జమ చేశారు. ఇందులో 2024-25 సంవత్సరానికి సంబంధించి యాసంగి సీజన్‌లో 99464 మంది రైతులకు 133837.06 ఎకరాలకు రూ.80 కోట్ల 30 లక్షల 22455 జమ చేశారు. 2025 సంవత్సరం వానాకాలం సీజన్లో 126278 మంది రైతులకు 248857.15 ఎకరాలకు సంబంధించి రూ.149 కోట్ల 27 లక్షల 47573 రైతుల ఖాతాలో చేశారు. 2025-2026 యాసంగిలో రెండు విడతల్లో 1.41 లక్షల మంది రైతులకు రూ.154 కోట్ల 34 లక్షల 40వేల 221 భరోసా సాయం నిధులు విడుదల చేశారు. ఇందులో 23478 మంది ఎస్సీ రైతులకు రూ.18.766 కోట్లు, 8106మంది ఎస్టీ రైతులకు రూ.8.62 కోట్లు, 109831 మంది రైతులకు రూ.126.95 కోట్ల భరోసా డబ్బులు జమ చేశారు.

ఖరీఫ్‌ మొదటి విడత రైతు భరోసా

మండలం రెవెన్యూ గ్రామాలు రైతులు విడుదలైన నిదులు(రూ.)

గంభీరావుపేట 18 12,581 12,51,46,553

ఇల్లంతకుంట 21 17,592 22,67,54,819

ముస్తాబాద్‌ 16 14,407 17,24,73,225

సిరిసిల్ల 05 3,929 3,57,03,449

తంగళ్ళపల్లి 16 12,467 14,57,50,747

వీర్నపల్లి 08 4,398 4,41,04,665

ఎల్లారెడ్డిపేట్‌ 17 11,544 13,25,42,656

బోయిన్‌పల్లి 16 10,771 12,82,44,033

చందుర్తి 11 10,274 12,89,57,943

కోనరావుపేట 21 12,569 14,87,94,208

రుద్రంగి 03 3,662 4,91,60,412

వేములవాడ 08 5,898 6,34,07,034

వేములవాడ రూరల్‌ 15 7,956 9,39,07,169

మొత్తం 175 1,28,048 149,49,46,913

Updated Date - Sep 24 , 2026 | 01:23 AM