భానుడి భగభగ...
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:02 PM
జిల్లాలో సూర్య ప్రతాపం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. వారం రోజులుగా విపరీతమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. ప గటి పూట బయటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవు తున్నారు.
-పగ టిపూట ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
-జిల్లా వ్యాప్తంగా మండుతున్న ఎండలు
-ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రజలు
-కాసిపేట మండలంలో 40.2 డిగ్రీలు నమోదు
మంచిర్యాల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సూర్య ప్రతాపం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. వారం రోజులుగా విపరీతమైన ఎండలతో ప్రజలు సతమతమవుతున్నారు. ప గటి పూట బయటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవు తున్నారు. గడిచిన నాలుగైదు రోజులుగా జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతుండడమే దీనికి కార ణం. ఉదయం పూట, రాత్రంతా చల్లగా ఉంటున్న వాతావ రణం మద్యాహ్నం విపరీతంగా వేడెక్కుతోంది. రాత్రి 8 గంటలు గడిస్తే తప్ప ఎలాంటి మార్పులు ఉండడం లేదు. ఉదయం 10 గంటలకే రోడ్లు, రహదారులు వేడెక్కుతుండ డంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతు న్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
తీవ్రతరమవుతున్న ఉష్ణోగ్రతలు.....
వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతు న్నాయి. ముఖ్యంగా పగటి వేళలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర తలు నమోదవుతుండగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవు తున్నారు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడం ఆందోళనకు రేకెత్తిస్తోంది. జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాల్లో అండర్ గ్రౌండ్ బొగ్గు బావులతో పాటు ఓపెన్‌కాస్టు మైన్‌లు అధిక సంఖ్యలో ఉండడంతో ఇక్కడి వాతావరణం తీవ్రంగా వేడుక్కుతోంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బయటకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి......
జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అధిక ఉ ష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురవుతుండగా సామాన్య జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలపై బ యటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్ధితులు నెల కొన్నాయి. పగటి పూట గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమో దవుతుండడంతో ఇండ్లలోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీలు ఉపయోగిస్తే కాని ఇండ్లలో ఉండే పరిస్ధితి లేదు. కూలర్‌లలోనూ వేడి గాలులు వస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 11 గంటలకే ముఖ్యమైన రహదారులపై జనసంచారం తగ్గుముఖం పడుతుండటం ఎండ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. మార్చి మాసంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఉష్ణోగ్రత ఇలా....
జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో నమోదైన ఉష్ణోగతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీన జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 38.4 డిగ్రీలు నమోదు అయ్యాయి. 25న 38.8 డిగ్రీలు, 26న 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, శుక్రవారం 40.2 డిగ్రీలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా శుక్రవారం కాసిపేట మండలం కొండాపూర్‌లో గరిష్టంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా వాతావరణ శాఖ రెడ్ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో అత్యల్పంగా తాం డూరు మండలంలో 37.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. భీమారం మండలంలో 39.9 డిగ్రీలు, జన్నారం మండలంలో 39.3 డిగ్రీలు, దండేపల్లి మండలం వెల్గనూర్ లో 39.2 డిగ్రీలు, భీమిని మండలంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.