భద్రాద్రి ఆలయ ప్రధాన అర్చకుడిగా కోటి రామస్వరూప్ రాఘవాచార్యులు
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:04 AM
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా కోటి రామస్వరూప్ రాఘవాచార్యులు నియమితులయ్యారు..
భద్రాచలం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా కోటి రామస్వరూప్ రాఘవాచార్యులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆలయ ఈవో కె. దామోదర్‌రావు, ఏఈవో శ్రావణ్‌కుమార్ సోమవారం ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. ప్రస్తుత ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. రామస్వరూప్ రాఘవాచార్యులు గతంలో కొద్దికాలం పాటు ఇన్‌చార్జ్ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు నిర్వహించారు.