Share News

రామయ్య కల్యాణం, పట్టాభిషేకాలకు రండి

ABN , Publish Date - Mar 24 , 2026 | 05:00 AM

భద్రాచలంలో 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకలకు రావాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను దేవాదాయ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు.

రామయ్య కల్యాణం, పట్టాభిషేకాలకు రండి

  • గవర్నర్‌ను ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

  • భద్రాచలంలో భూమి పూజకు రానున్న సీఎం రేవంత్‌

భద్రాచలం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): భద్రాచలంలో 27న జరిగే సీతారాముల కల్యాణం, 28న జరిగే శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకలకు రావాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను దేవాదాయ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. దేవస్థానం వైదిక పరిపాలన అధికారులతో కలిసి హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఆమె గవర్నర్‌ శుక్లాను కలిశారు. వైదిక సిబ్బంది గవర్నర్‌కు వేద ఆశీర్వచనం అందజేయగా, మంత్రి స్వామి వారి శాలువా, ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు. అనంతరం నవమి, పట్టాభిషేకానికి గవర్నర్‌ను ఆహ్వానిస్తూ భద్రాద్రి దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి రాజపత్రాన్ని చదివారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్లు ఆ రాజపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. మరోవైపు ఈ నెల 27న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలం వస్తున్నారు. ఆయన చేతుల మీదుగా ఆలయాభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం ఉంటుంది.

Updated Date - Mar 24 , 2026 | 05:00 AM