Share News

భద్రాద్రిలో రామయ్య పెండ్లి పనులు ప్రారంభం

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:01 AM

ఈ నెల 27న భద్రాచలంలో నిర్వహించే రామయ్య కల్యాణానికి అవసరమైన తలంబ్రాల తయారీ ప్రకియ్ర ప్రారంభమైంది. మిథిలా స్టేడియంలో సంప్రదాయబద్ధంగా....

భద్రాద్రిలో రామయ్య పెండ్లి పనులు ప్రారంభం

  • తలంబ్రాల తయారీ ప్రారంభం.. వైభవంగా డోలోత్సవం

భద్రాచలం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఈ నెల 27న భద్రాచలంలో నిర్వహించే రామయ్య కల్యాణానికి అవసరమైన తలంబ్రాల తయారీ ప్రకియ్ర ప్రారంభమైంది. మిథిలా స్టేడియంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత కల్యాణ కార్యక్రమంలో పాల్గొనే రుత్వికుల సతీమణులు పసుపును రోట్లో దంచారు. అలాగే తలంబ్రాలను కూడా కలిపారు. అనంతరం పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్కగులాల్‌, అత్తర్‌, పన్నీర్‌, నూనె, సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను సిద్ధం చేశారు. నిత్యకల్యాణ మండప వేదిక వద్ద శ్రీ సీతారామచంద్రస్వామికి డోలోత్సవం, వసంతోత్సవ కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Updated Date - Mar 05 , 2026 | 02:01 AM