Share News

‘భద్రాచలం’లో తూర్పు వైపు నుంచే ప్రవేశాలు

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:23 AM

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించే భక్తులను ఇకపై రామాలయం తూర్పు వైపు నుంచి అనుమతిస్తారు.

‘భద్రాచలం’లో తూర్పు వైపు నుంచే ప్రవేశాలు

భద్రాచలం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించే భక్తులను ఇకపై రామాలయం తూర్పు వైపు నుంచి అనుమతిస్తారు. లోపలికి వెళ్లే భక్తులు రామయ్య, అంజన్న దర్శనం అనంతరం మళ్లీ తూర్పు వైపు నుంచే బయటకు రావాల్సి ఉంటుంది. రామాలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా పడమర మెట్లు తొలగిస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయంగా ఈ ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షపు జల్లుల కారణంగా మిథిలా స్టేడియంలో కల్యాణ మండప వేదిక ప్రాంగణం చిత్తడిగా మారి అడుగులోపు నీరు చేరింది. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు ఇబ్బందులు తలెత్తడంతో అధికారులు కుర్చీలను తెప్పించారు. దీంతో భక్తులు కుర్చీల్లోనే కూర్చొని కల్యాణాన్ని తిలకించారు.

Updated Date - Aug 17 , 2026 | 06:24 AM