Share News

ఏపీలో భద్రాచలం!

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:46 AM

భద్రాచలం ఎక్కడుంది? తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కదా!? కానీ కేంద్ర జనగణనలో భాగంగా చేపట్టిన స్వీయగణనలో మాత్రం భద్రాచలం పట్టణం తెలంగాణలో లేదని చూపిస్తోంది.

ఏపీలో భద్రాచలం!

  • స్వీయగణన ప్రక్రియలో సమస్య

  • జియోకోడింగ్‌ చేస్తుంటే.. భద్రాచలం పట్టణం తెలంగాణ సరిహద్దు బయట ఉన్నట్టు సందేశం

  • 2, 3 రోజుల్లో పరిష్కరిస్తాం: భద్రాచలం తహసీల్దార్‌

భద్రాచలం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): భద్రాచలం ఎక్కడుంది? తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కదా!? కానీ కేంద్ర జనగణనలో భాగంగా చేపట్టిన స్వీయగణనలో మాత్రం భద్రాచలం పట్టణం తెలంగాణలో లేదని చూపిస్తోంది. భద్రాచలం పట్టణాన్ని ఎంపిక చేసుకోవాలని చూస్తే.. ‘జియోకోడింగ్‌ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడిందంటూ సందేశం వస్తోంది. జనగణనలో భాగంగా స్వీయగణనకు అవకాశం ఇవ్వడంతో.. భద్రాచలం పట్టణంలోని స్థానికులు ఆన్‌లైన్‌లో నమోదు కోసం ప్రయత్నించారు. జిల్లాను ఎంపిక చేసి.. జియోలొకేషన్‌లో తాము నివసిస్తున్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని చూసినప్పుడు ‘సరిహద్దు ప్రాంతం పరిమితం చేయబడింది. జియో కోడింగ్‌ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయబడింది’ అని సందేశం చూపిస్తోంది. దీనిపై భద్రాచలం తహసీల్దార్‌ వెంకటేశ్వర్లును ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. సమస్యను జనాభా లెక్కల సాంకేతిక బృందానికి నివేదించామని తెలిపారు. సమస్యకు రెండు, మూడు రోజుల్లో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం గూగుల్‌ మ్యాప్స్‌లో భద్రాచలం పట్టణం తెలంగాణలో కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నట్టు చూపిస్తుండటం గమనార్హం.

Updated Date - Apr 29 , 2026 | 06:47 AM