Share News

దేశంలో ఉత్తమ ఐటీడీఏ పీవోగా రాహుల్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:45 AM

భద్రాచలం ఐటీడీఏ పీవో(ప్రాజెక్టు ఆఫీసర్‌) బి.రాహుల్‌ దేశంలోనే ఉత్తమ పీవోగా ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నీతి....

దేశంలో ఉత్తమ ఐటీడీఏ పీవోగా రాహుల్‌

భద్రాచలం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : భద్రాచలం ఐటీడీఏ పీవో(ప్రాజెక్టు ఆఫీసర్‌) బి.రాహుల్‌ దేశంలోనే ఉత్తమ పీవోగా ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించి న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అశోక్‌కుమార్‌, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రంజన్‌ చోప్రా నుంచి అవార్డు స్వీకరించారు. రాహుల్‌ వెంట ఐటీడీఏ ఏపీవో డేవిడ్‌ రాజు కూడా ఉన్నారు. అవార్డుతోపాటు రూ.5లక్షల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందుకున్నారు. గిరిజన మ్యూజియం, భద్రగిరి మార్టు, ఉద్దీపకం, కెరీర్‌ గైడెన్స్‌, కోయ ఇలవేల్పుల చరిత్ర, క్రీడలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఆయనకు ఈ పురస్కారం దక్కింది.

Updated Date - Jun 04 , 2026 | 05:45 AM