kumaram bheem asifabad- రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 10:11 PM
జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది అందరు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్ భవన సముదాయం నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది అందరు క్షేత్రస్థాయిలో పారదర్శకంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరేట్ భవన సముదాయం నుంచి జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందితో మంగళవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అందుకు అనుగుణంగా వైద్యలు, హెల్త్ సూపర్‌వైజర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కచిత్చమైన సమయపాలన పాటిం చాలని ఆదేశించారు. విధుల్లో ఎలాంటి అలసత్వం వహించరాదని హెచ్చరించారు. ముఖ్యంగా సిబ్బంది హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారానే ప్రతి ఒక్కరు విధిగా హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది యొక్క పని తీరును, యాప్ హాజరును ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పీహెచ్‌సీల పరిధిలో గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి అవసరమైన మందులు, టీకాలు సకాలంలో అందేలా చూడా లని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులతో సిబ్బంది మర్యాద పూర్వకంగా నడుచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సీతారాం, ఉప వైద్యాధికారి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్య శిక్షణతో ఉద్యోగావకాశాలు
జైనూర్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతీ యువకులు నైపుణ్యాలను పెంపోందించుకుని ఉపాధి ఆవకాశాలను అంది పుచ్చుకోవాలని కలెక్టర్ కె హరిత సూచించారు. జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల యువతి యువకులకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ ఆవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సంప్రదాయ ఉద్యోగ అవకాశాలు తగ్గు ముఖం పడుతున్నా యని చెప్పారు. యువత తప్పనిసరిగ్గా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఈ క్రమంలో జీఎంఅర్ సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందించి, శిక్షణ ఆనంతరం ఉద్యోగ ఆవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటు న్నారని చెప్పారు. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలతో పాటు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల యువత సద్వినియోగం చేసుకోని తమ భవిష్యతుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. శిక్షణ కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులకు రాక పోకల కోసం సౌకర్యం కల్పిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం, స్వఛ్ఛంద సంస్థలు కలిసి యువతకు ఉపాధి ఆవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాయని కలెక్టర్ కొనియాడారు. ఈ సందర్భంగా జీఎంఅర్ ప్రతినిధులు శిక్షణ కార్యక్రమాల వివరాలను యువతకు వివరించి, నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జీఎంఅర్ సంస్థ ప్రోగ్రాం అఽధికారి మనోహర్, మోబలైజర్ కోఆర్డినేటర్ రాంకృష,్ణ జిల్లా ఉపాధి కల్పన సంస్థ అధికారి కిరణ్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ ఆడ బీర్షావ్, ఆర్‌ఐ మోహన్, ఎంపీవో శశికుమార్, ఈవో కోరేంగ ఆనంద్‌రావ్, గ్రామ కార్యదర్శి హరిచందర్ పాల్గొన్నారు.