రైతులకు మెరుగైన సేవలందించాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 11:34 PM
వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) పాలకవర్గ సభ్యులు రైతులకు మెరుగైన సేవలందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నరు. మండలంలోని కర్ణమామిడి పీఏసీఎస్ చైర్మన్‌గా కొట్టె మహేందర్, వైస్ చైర్మన్‌గా సాయిని రామ్‌చందర్ రావు శనివారం గ్రామంలోని కమ్యూనిటీహాల్‌లో బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు.
పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు
- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు
హాజీపూర్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) పాలకవర్గ సభ్యులు రైతులకు మెరుగైన సేవలందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నరు. మండలంలోని కర్ణమామిడి పీఏసీఎస్ చైర్మన్‌గా కొట్టె మహేందర్, వైస్ చైర్మన్‌గా సాయిని రామ్‌చందర్ రావు శనివారం గ్రామంలోని కమ్యూనిటీహాల్‌లో బాధ్యతలు చేపట్టగా ఎమ్మెల్యే హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, ఏడాదిలో 10 వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా పనిచేయాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు. కమ్యూనిటీహాల్‌లో డైనింగ్ వసతులు, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ.20లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బీటీ, లింక్ రడ్డు పనులను వచ్చే ఉగాది నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఎల్లంపల్లి పునరావాస పరిహార సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తాతనన్నారు. నీటి కొరత దృష్ట్యా యాసంగిలో నీటి అవసరం ఎక్కువ ఉన్న పంటలు వేసి నష్టపోవద్దని రైతులకు సూచించారు. పీఏసీఎస్ చైర్మన్ కొట్టె మహేందర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు, పార్టీ నాయకులకు రుణపడి ఉంటానన్నారు. రైతుల సంక్షేమానికి, సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అనంతరంకర్ణమామిడి కస్తూర్భా విద్యాలయం ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు వినతిపత్రం అందించారు. విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నూతన భవనం నిర్మించాలని, సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేయాలని కోరారు.