Share News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:37 PM

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

బెల్లంపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగుల పరిస్థితి, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వ్యాధుల వివరాలను తెలుసుకుని వైద్యులకు పలు సూచనలు చేశారు. పండగల వేళల్లో కూడా ఆసుపత్రి రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు వైద్యులు తప్పనిసరిగా విధుల్లో ఉండాలన్నారు. ఎమర్జెన్సీ వార్డును నిరంతరం తెరిచి ఉంచాలని, కనీసం ఒక మెడికల్‌ డాక్టర్‌ విధిగా ఉండాలన్నారు. కలెక్టర్‌ వెంట వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 11:37 PM