kumaram bheem asifabad-ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:51 PM
ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, సిబ్బంది హజరు రిజిస్టర్, వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ హజరు వివరాలను పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలకు వైద్యులు అందిస్తున్న సేవలు, అల్పహారం, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది విదుల పట్ల సమయపాలన పాటించాలని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, సిబ్బంది హజరు రిజిస్టర్, వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ హజరు వివరాలను పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలకు వైద్యులు అందిస్తున్న సేవలు, అల్పహారం, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది విదుల పట్ల సమయపాలన పాటించాలని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలోని వార్డులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. మారుమూల గిరిజన గ్రామాల నుంచి చికిత్సల కోసం వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం ఆసుపత్రి బయట రహదారిపై గల మురుగు కాలువలో చెత్తను వెంటనే తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, మున్సిపల్ కమీషనర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం
కెరమెరి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గోయగాం గ్రామంలో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ హరిత ముఖ్య అతిథిగా హాజరై చిన్నారుల చేస అక్షరాభ్యాసం చేయించారు. బుధవారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చి దిద్దడంలో గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి కట్టుగా ముందుకు రావడం ఆదర్శనీయమన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఇదే రీతిలో అభివృద్ధి పథంలో నడిపించాలని విద్యాశాఖ అదికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీఈవో సచ్చిదానందచారి, ఎంఈవో ప్రకాష్, సర్పంచ్‌ఆఅత్రం ఆనంద్‌రావు, ఉపసర్పంచ్ రాందాస్, పటేల్ శంకర్, గ్రామస్తులు సురేష్, సునీల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.