Share News

kumaram bheem asifabad- రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , Publish Date - Oct 14 , 2026 | 10:22 PM

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ కిరణ్‌ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట్‌లతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ కిరణ్‌ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట్‌లతో కలిసి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని ఎళ్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని విధులకు గైర్హాజరు అయ్యేందుకు సరైన అనుమతి పొందాలన్నారు. ఆసుపత్రిలలోనే ప్రసవం చేసుకునేలా అవగాహన కల్పించాలని 100 శాతం సుఖ ప్రసవాలకు కృషి చేయాలని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించాలని ప్రసవాల సంఖ్యను పెంచాలని అదేశించారు. ఈ సమావేశంలో వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలి

జిల్లాలోని ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కింద ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, అయాల పోస్టులకు బారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని దరఖాస్తుతో పాటు జత పరిచిన ధ్రువ పత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో డిడబ్ల్యుఓ స్వరూపరాణితో కలిసి ఐసీడీఎస్‌ అధికారులతో సమీక్షించారు. ఈనెల 8న అంగన్‌వాడీ టీచర్ల, అయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడం జరిగిందని బారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీడీపీఓలు, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తు ద్రువ పత్రాలను పరిశీలించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణలో బుధవారం జిల్లా మహిళ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు కలెక్టర్‌ కె హరిత, అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌లతో కలిసి హాజరయ్యారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రకృతిలో లబించే పూలను సేకరించి బతుకమ్మగా పేర్చి దేవతగా పూజించే తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా చాటిచెప్పిన మన పండుగ బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతిని భావి తరాలకు అందించడంతో పాటు మన సంప్రదాయాల గొప్ప తనాన్ని చాటి చెప్పాలని తెలిపారు. అనంతరం మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో స్వరూపరాణి, మహిళా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలం హత్నిలో బుధవారం బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు నార వనజ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూరు మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రకృతి పూలతో తయారు చేసి బతుకమ్మ ఆటలు తెలంగాణలో ప్రత్యేకమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 10:22 PM