మెరుగైన వైద్య సేవలు అందించాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:57 PM
ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని 30పడకల ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
లక్షెట్టిపేట, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే ప్రజలకు మంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని 30పడకల ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. ఆసు పత్రిలో వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పూర్తిస్థాయిలో మం దులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రి లోని వార్డులు తిరుగుతూ వైద్య సేవలను ఆరా తీసారు. అంతే కాకుండా పలు రికార్డులను పరిశీలించారు.
అంతకు ముందు పట్టణంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్నటువంటి అదనపు గదులతో పాటు వంటశాలను పరిశీలించి పలు సలహాలు సూచనలు అందజేసారు. పిల్లలకు రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచంచారు. ఈకార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్, వైద్యు లు వంశీ, సురేష్, స్రవంతితో పాటు కస్తూరిబాగాందీ ప్రిన్సిపల్ కవిత సిబ్బంది ఉన్నారు.