Share News

మెరుగైన వైద్య సేవలు అందించాలి :

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:28 PM

ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎం హెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆ కస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి :
భీమిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాలను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌

డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌

భీమిని, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎం హెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆ కస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది తో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలు కు రుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తగు జాగ్రత్తలు అం దించాలన్నారు. ప్రభుత్వం వైద్యంపై ప్రత్యేక దృష్టి ని లిపిందని, దవాఖానాల్లో సౌకర్యాలు కల్పించడంతో పా టు సేవలను విస్తృత పరుస్తున్నట్లు తెలిపారు. పల్లెల్లో ని నిరుపేదలు ప్రభుత్వ అసుపత్రులపై ఆధార పడతా రని వారికి తగిన ఆదరణతో వైద్యలు, సిబ్బంది సేవల ను అందించాలని సూచించారు. విధులకు సమయపా లన పాటించాలని, అసుపత్రిలో విధులకు సక్రమంగా హాజరై, సిబ్బంది విధులకు సమయపాలన పాటించా లని, ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరగాలని, గ్రామాల్లో సబ్‌ సెంటర్లను విధిగా ప్రతీ రోజూ తెరువాలని, చక్క టి ప్రణాళికలతో గ్రామీణులకు వైద్య సేవలు అందించా లని సూచించారు. ఫిర్యాదులు వస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆ సుపత్రి రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. వర్షా లు పడుతున్నందున రాపిడ్‌ ఫీవర్‌ సర్వే కార్యక్రమం లో భాగంగా ప్రతీ రోజూ 50 ఇండ్లను సందర్శించా లన్నారు. ఈ నెల 13 న జరిగే జాతీయ నులిపురుల ని ర్మూలన కార్యక్రమంలో ఒకటి నుంచి 19 ఏళ్ల పిల్లలం దరికీ అల్బెండేసోలు మాత్రలు అందించాలన్నారు. ప్రతీ ఇంటి వద్ద ఆరోగ్య సమస్యలను తెలుసుకోని చిరు వ్యాధులకు చికిత్సలు అందించాలని సూచించారు. స్థానిక హాస్టల్‌లు, పాఠశాలల్లో నిరంతరం తనిఖీలు చేస్తూ అవసరం ఉంటే వైద్య శిబిరాలను ఏర్పాటు చే యాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధాకర్‌ నాయక్‌, వైద్యురాలు నిర్మల, సీహెచ్‌వో అ ల్లాడి శ్రీనివాస్‌, నాందేవ్‌, హెచ్‌ఈవో శ్రీనివాస్‌, డీఈ ఎంవో వెంకటేశ్వర్లు, హెచ్‌వీ ఇందిర, హెచ్‌ఏలు ఉమా శంకర్‌, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 11:28 PM