ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:05 AM
జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వైద్య సేవలకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియను అవసరాలకు అనుగుణంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని అవసరమైన ఆసుపత్రులకు సర్దుబాటు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పరిసరాలు, వార్డులు, వైద్య గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. రోగులకు అవసరమైన మందులు, వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముం దస్తు చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ వ్యాధుల వ్యాప్తికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ పవిత్ర, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీధర్, సుల్తానాబాద్ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమాదేవి, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడలపై ఆసక్తి చూపాలి
పెద్దపల్లి కల్చరల్: యువత క్రీడలకు మరింత చేరువ కావాలని, మత్తుకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆరోగ్యవంతమైన సమాజం, డ్రగ్స్ రహిత యువతే లక్ష్యంగా వచ్చే నెల 27న నిర్వహించనున్న నాలుగో కరీంనగర్ హాఫ్ మారథాన్ పోస్టర్ ఆవిష్కరించారు. క్రీడలు, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ తదితర శారీరక వ్యాయామలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ మారథాన్‌లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. డీఎంఓ ప్రవీణ్ రెడ్డి, కేఆర్‌సీఏ అధ్యక్షుడు పసుల మహేష్, మహిపాల్ రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.