Share News

kumaram bheem asifabad- విద్యుత్‌ సరఫరాలో విఫలం

ABN , Publish Date - Sep 29 , 2026 | 10:50 PM

వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరా చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. కౌటాలలోని 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ను కార్యకర్తలతో మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా లాక్‌ బుక్‌లను పరిశీలించారు.

kumaram bheem asifabad- విద్యుత్‌ సరఫరాలో విఫలం
రికార్డులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు

కౌటాల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరా చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు తెలిపారు. కౌటాలలోని 33/11 కెవి సబ్‌ స్టేషన్‌ను కార్యకర్తలతో మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా లాక్‌ బుక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఈ, ఇన్‌చార్జి ఏఈతో మాట్లాడి వివిధ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి ఐదు నుంచి ఏడు గంటలు మాత్రమే విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని, దీంతో మిర్చి పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. 12 గంటల విద్యుత్‌ సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండు చేశారు. అలాగే గృహ అవసరాలకు కూడా సాయంత్రం వేళల్లో ఎ్జర్జేని లోడ్‌ రిలీఫ్‌ పేరిట అప్రకటిత కోతలు విధిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 10:50 PM