Share News

kumaram bheem asifabad-రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , Publish Date - Sep 29 , 2026 | 10:47 PM

మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం చేస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ కె హరిత హెచ్చరించారు. స్థానిక పీహెచ్‌సీ, సీహెసీలను మంగళవారం కలెక్టర్‌ హరిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు

kumaram bheem asifabad-రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
రెసిడెన్షియల్‌ కాలేజీలో నిత్యావసర సరకులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

జైనూర్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, నిర్లక్ష్యం చేస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ కె హరిత హెచ్చరించారు. స్థానిక పీహెచ్‌సీ, సీహెసీలను మంగళవారం కలెక్టర్‌ హరిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. స్టోర్‌ రూం, శస్త చికిత్సల గది, ప్రసవాల గదులను వారు క్షుణంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఆసుపత్రులలో కొందరు డాక్టర్లు స్థానికంగా ఉండడం లేదన్నారు. దీంతో సరైన వైద్యం అందడం లేదని దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఇంత పెద్ద ఆసుపత్రి భవనం ఉన్నపటికి పారిశుధ్యం లోపించిందని చెప్పారు. రోగులకు వైద్యం అందని ద్రాక్షలా తయారైందన్నారు. రెండు, మూడు రోజుల్లో వైద్య సిబ్బంది పని తీరును మార్చుకోవాలని సూచించారు. లేని ఏడల పని చేయని సిబ్బంది కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతకు ముందు భుసిమెట్ట బాలికల రెసిడెన్షియల్‌ కాలేజీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అక్కడి సదుపాయాలు, భోజన వసతి, విద్య తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరకులను పరిశీలించారు. వెనూ ప్రకారం భోజన సదుపాయం కల్పించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశించారు. కొందరు ఉపాధ్యా యులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరు అయిన ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగర్‌గోజే అశోక్‌, వైద్యాధికారులు మురళి కృష్ణ వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): హియరింగ్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కల్టెకర్‌ కె.హరిత అన్నారు. కెరమెరిలో జరుగుతున్న హియరింగ్‌ ప్రక్రియను మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రత్యేక సవరణలో మ్యాపింగ్‌ కాని, అనామలిస్‌ ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అనర్హుల పేర్ల ఓటరు జాబితాలో ఉండకూడదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేట్టు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గ్రామ నక్షాలు లేని గ్రామాలు, కడస్టల్‌, నాన్‌ కడస్టల్‌ గ్రామాల్లో భూములను రీసర్వే చేయటం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి హద్దులు వివాదాలు ఉండవని సూచించారు. ఈ కార్యక్రమంతో తహసిల్దార్‌, డిప్యూటీ తహసిల్దార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 10:47 PM