ఫిట్‌నెస్‌తోనే మెరుగైన ఆరోగ్యం
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:30 PM
ఫిట్‌నెస్‌తోనే మెరుగైన ఆరోగ్యం సిద్దిస్తుందని, ఆరోగ్యం విష యంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షు డు, సేవా భారతి రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి పే ర్కొన్నారు.
-బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఫిట్‌నెస్‌తోనే మెరుగైన ఆరోగ్యం సిద్దిస్తుందని, ఆరోగ్యం విష యంలో అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్య క్షు డు, సేవా భారతి రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి పే ర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుం చి శ్రీనివాస గార్డెన్ వరకు 5, 10 కే రన్‌ను నిర్వహించారు. వాకర్స్, వైద్యులు, యువకులు, మహిళలు 1200 మందికి పై గా ఈ రన్‌లో పాల్గొనగా జెండా ఊపి ఆయన రన్‌ను ప్రా రంభించారు. ఈ సందర్భంగా రఘునాధ్ వెరబెల్లి మాట్లా డుతూ ప్రతి ఒక్కరు శారీరక ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల న్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సా ధించగలమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఉదయం వాకింగ్, యోగా, రన్నింగ్, వ్యాయామం చేయాలన్నారు. క్రమం తప్ప కుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గు తుందన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మం చి అలవాట్లను చేసుకుంటే ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటా రన్నారు. అనంతరం రన్‌లో పాల్గొన్న వారందరికి టీషర్ట్‌ల ను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, ఏకలవ్య ఆశ్రమం అధ్యక్షుడు ఒ డ్నాల లక్ష్మీనారాయణ, నాయకులు గాజుల ముకేష్‌గౌడ్, కస్తూరి నాగరాజు, అమిరిశెట్టి రాజ్‌కుమార్, బొట్ల సత్యం, శ్రీశైలం, రమేష్, చక్రవర్తి, బాపు, ప్రవీణ్, స్వప్నరాణి, ప్రేమ్ సింగ్, శ్రీనివాస్, కిశోర్, క్రీడాకారులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.