Share News

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు

ABN , Publish Date - May 14 , 2026 | 11:31 PM

కాంగ్రెస్‌ ప్ర భుత్వం ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యారంగానికి పెద్దపీట వేస్తుం దని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు
ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- పది ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించాలి

- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- కొనసాగుతున్న విద్యావారోత్సవాలు

తిమ్మాజిపేటపెద్దకొత్తపల్లి/ కల్వకుర్తి/ నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ కొల్లాపూర్‌/ ఊర్కొండ/ తాడూరు/ ఉప్పునుంతల/ అమ్రా బాద్‌/ పదర/ బల్మూరు, మే 14 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్ర భుత్వం ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యారంగానికి పెద్దపీట వేస్తుం దని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. గురువారం తిమ్మాజిపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యా లయంలో పీఎంశ్రీలో మంజూరైన నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులు, సైన్స్‌ ల్యాబ్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కుమార్‌, తహసీల్దార్‌ జయంతి, ఎంఈవో సత్య నారాయణశెట్టి, ప్రత్యేక అధికారి సుజాతతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో నిర్వహిస్తు న్న విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రథమ స్థానం సాధించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థు లకు టైలు, బూట్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని తెలిపారు. సర్పంచ్‌ల సంఘం మండల అధ్య క్షుడు గోపాల్‌నాయక్‌, సర్పంచ్‌లు కృష్ణకుమార్‌, రామాంజనే యులు, నాయకులు వివేక్‌రెడ్డి, వెంకట్రాం రెడ్డి, మల్లయ్యగౌడ్‌, శ్రీనివాస్‌ బహుదూర్‌, మాధవులు, లక్ష్మీనారాయణ, లింగం హర్షవర్ధన్‌రెడ్డి, రవూఫ్‌, నాగసాయిలు పాల్గొన్నారు.

విశిష్ట సేవలకు ప్రశంస

- తెలంగాణ విద్యాశాఖ కమిషన్‌ సభ్యుడు వెంకటేశ్‌

పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ ప్రాథమికోన్నత పా ఠశాల ప్రధానోపాధ్యాయుడు రాత్లావత్‌ రాముడునాయక్‌ను గురువారం తెలంగాణ విద్యాశాఖ కమిషన్‌ సభ్యుడు చారకొ ండ వెంకటేశ్‌ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశిష్ట సేవలు అందించడం ప్రశంసనీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో టీఎస్పీ టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.రోహిత్‌నాయక్‌ పాల్గొన్నారు.

ఫ కల్వకుర్తి మండలం తుర్కలపల్లి పాఠశాలను గురు వారం విద్యా కమిషన్‌ సభ్యుడు చారకొండ వెంకటేశ్‌ సందర్శిం చారు. విద్యాభివృద్దికి సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి నాయక త్వంలోని ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిం చాలని కోరారు.

Updated Date - May 14 , 2026 | 11:31 PM