kumaram bheem asifabad- మెరుగైన విద్య అందించాలి
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:56 PM
ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. సుమారు గంటపాటు ఉపాధ్యాయు లతో కలిసి కూర్చుని శిక్షణ విధానాన్ని శ్రద్ధదా పరిశీలించారు
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని, గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఐదురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. సుమారు గంటపాటు ఉపాధ్యాయు లతో కలిసి కూర్చుని శిక్షణ విధానాన్ని శ్రద్ధదా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధన విధానాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేసి గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని సూచించారు. కార్యక్రమంలో డీడీ జాదవ్ అంబాజీ, ఏసీఎంవోలు ఉద్దవ్, లక్ష్మయ్య, జీసీడీవో శకుంతల, జిల్లా క్రీడల అధికారి శేకు, కోర్సు డైరెక్టర్ రవిందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): బోధనలో ఆధునిక పద్ధతులు అమలు చేయాలని ఎంఈవో వాసాల ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల(ఓల్డు)లో బుధవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌ఈఆర్‌టీ తెలంగాణ విద్యా కార్యక్రమాలు అమలు పకడ్బందీగా చేయాలని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న ఆధునిక బోధనా పద్ధతులను తరగతి గదిలో అమలు చేయాలన్నారు. శిక్షణలో ప్రధానోపాధ్యాయుడు పర్స చంద్రశేఖర్, అమరేందర్ రెడ్డి, వెంకటరాజయ్యతో పాటు శిక్షకులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో విషయ అవగాహన పెంపొందిచాలని ఎంఈవో నానాజీ అన్నారు. కౌటాలలో జరిగిన శిక్షణ శిబిరంలో ఎంఈవో నానాజీ మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం జాతీయ స్థాయిలో 36 నుంచి 26వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. శిక్షణలో కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు రాంచందర్, జిల్లా రిసోర్స్‌పర్సన్ ఎన్.శ్రీనివాస్, మండల రిసోర్స్‌పర్సన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు పర్చాలని ఎంఈవో సదాశివుడు అన్నారు. మండల కేంద్రంలో శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు పర్చాలని ఎంఈవో చెరుకుపల్లి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమంలో శిక్షకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు పర్చాలని ఎంఈవో జయరాజు అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా జడ్పీపరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల శిక్షణ శిబిరంలో ఎంఈవో మాట్లాడారు. కార్యక్రమంలో కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు పెద్దులు పాల్గొన్నారు.