Share News

kumaram bheem asifabad- ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

ABN , Publish Date - May 17 , 2026 | 10:12 PM

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఆదివారం విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

kumaram bheem asifabad- ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందిస్తున్నామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఆదివారం విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయిలో నిలుస్తారని ప్రభుత్వ పాఠశాలల్లో నిష్టాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని విద్యార్థులు కష్టపడి చదివి ఎంచుకున్న లక్ష్యాలను సాదించాలని అకాంక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను ప్రొత్సహించాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సహకారం అందించాలని తెలిపారు. మండల విద్యాదికారులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు తెలియజేసి పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను పెంచాలని తెలిపారు. అనంతరం పదవ తరగతిలో జిల్లా టాపర్‌లుగా నిలిచిన అరుగురు విద్యార్థులకు, క్రీడలలో జాతీయస్థాయిలో పాల్గొన్నటు వంటి ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యే హరీష్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అనిల్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఆహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇరుకుల్ల మంగ, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆలీబీన్‌ ఆహ్మద్‌, డీఈవో లలిత, విద్యశాఖ అధికారులు జనార్దన్‌, శ్రీనివాస్‌, లతీఫ్‌, శాంతికుమార్‌, భాగ్యలక్ష్మి, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 10:12 PM