ఏకాగ్రతతో చదివితేనే ఉత్తమ ఫలితాలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:37 PM
విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలె క్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం దండేపల్లి మండల కేంద్రాన్ని పర్యటించి స్థానిక ప్రభుత్వం పీఎం శ్రీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తహసీల్దార్ కా ర్యాలయాలను పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆసప త్రుల్లో మౌలిక సదుపాయాలు మెరగుపరిచి ప్రజలకు నాణ్య మైన సేవలు అందించాలన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి, అక్ఠోబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలె క్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం దండేపల్లి మండల కేంద్రాన్ని పర్యటించి స్థానిక ప్రభుత్వం పీఎం శ్రీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తహసీల్దార్ కా ర్యాలయాలను పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆసప త్రుల్లో మౌలిక సదుపాయాలు మెరగుపరిచి ప్రజలకు నాణ్య మైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోని పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ స్వ యంగా గణిత పాఠాలు బోధించారు. పాఠశాలలోని అసం పూర్తి భవన నిర్మాణ పనులను పరిశీలించి టెండర్ ప్రక్రియ ద్వారా త్వరలో పనులు పూర్తి చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అ నంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డుల, పడకలు, మందుల నిల్వలు, వైద్య సేవలను తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భా రతి దరఖాస్తుల పరిష్కారంపై వివరాలు తహల్దార్‌ను అడి గి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఎంపీడీవో ప్ర సాద్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్ ఉన్నారు.