చార్మినార్ వద్ద బెంగాలీ నటికి వేధింపులు
ABN , Publish Date - May 07 , 2026 | 05:47 AM
చార్మినార్ చూడటానికి వచ్చిన ఓ బెంగాలీ నటి పట్ల స్థానిక వ్యక్తి ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. బెంగాలీ నటి ప్రత్యూష పాల్(25) సోమవారం మధ్యాహ్నం చార్మినార్‌లోకి...
నటిని అసభ్యకరంగా తాకిన వ్యక్తి.. ఏడు రోజుల జైలు
చార్మినార్ మే 6 (ఆంధ్రజ్యోతి): చార్మినార్ చూడటానికి వచ్చిన ఓ బెంగాలీ నటి పట్ల స్థానిక వ్యక్తి ఒకరు అసభ్యంగా ప్రవర్తించాడు. బెంగాలీ నటి ప్రత్యూష పాల్(25) సోమవారం మధ్యాహ్నం చార్మినార్‌లోకి వెళ్లి చార్మినార్ అందాలను తిలకిస్తుండగా.. అదే సమయంలో ఫస్ట్ లాన్సర్‌న బస్తీకి చెందిన అబ్దుల్ వాజిద్ కూడా తన కొడుక్కి చార్మినార్‌ను చూపించడానికి లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రత్యూష పాల్‌ను అసభ్యకరంగా తాకడం మొదలుపెట్టాడు. ఆమె వెంటనే అప్రమత్తమై అతడి చేయి పట్టుకొని నిలదీసింది. స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి చార్మినార్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఏడు రోజుల శిక్ష విధించారని చార్మినార్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు తెలిపారు.