kumaram bheem asifabad- ‘లేబర్ కార్డు’’తో ప్రయోజనం
ABN , Publish Date - Sep 08 , 2026 | 10:56 PM
ఎండ, వానలో కాయకష్టం చేస్తూ చాలీచాలని కూలీ డబ్బులతో బతుకు బండిని నెట్టుకొస్తున్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌కార్డు ఓ వరం లాంటిది. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అర్హత గల కార్మికులు లేబర్ కార్డు పొందితే వివాహం, ప్రసూతి, ప్రమాదాలు, సహజ మరణం, ఆసుత్రి చికిత్స తదితర సందర్భాల్లో ఆర్థిక సాయం పొందే అవకాశముంది. దీని కోసం 18-60 ఏళ్ల వయసు ఉన్న కార్మికులు కుంటుంబ సభ్యుల ఆధారు, నామిని వివరాలు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి మీ సేవలో నిర్ణీత రుసుము చెల్లించి లేబర్ కార్డు పొందాల్సి ఉంటుంది.
వాంకిడి సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎండ, వానలో కాయకష్టం చేస్తూ చాలీచాలని కూలీ డబ్బులతో బతుకు బండిని నెట్టుకొస్తున్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్‌కార్డు ఓ వరం లాంటిది. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అర్హత గల కార్మికులు లేబర్ కార్డు పొందితే వివాహం, ప్రసూతి, ప్రమాదాలు, సహజ మరణం, ఆసుత్రి చికిత్స తదితర సందర్భాల్లో ఆర్థిక సాయం పొందే అవకాశముంది. దీని కోసం 18-60 ఏళ్ల వయసు ఉన్న కార్మికులు కుంటుంబ సభ్యుల ఆధారు, నామిని వివరాలు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి మీ సేవలో నిర్ణీత రుసుము చెల్లించి లేబర్ కార్డు పొందాల్సి ఉంటుంది. కార్డు రిజిస్ట్రేషన్ కోసం గడిచిన 12 నెలల్లో కనీసం 90 రోజులు భవన నిర్మాణ రంగంలో పని చేసి ఉండాలి. ఒకసారి నమోదు చేసుకుంటే ఐదు సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేసుకుంటే ఆర్థిక ప్రయోజనం అందుకోవడానికి ఏడాది పూర్తి కావాలనే నిబంధన వర్తిస్తుంది.
- ఏడాది లోపు..
ప్రసూతి తేదీ నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేసుకుంటే లేబర్ కార్డుదారులకు లేదా వారి కుమార్తె వివాహానికి, రెండు కాన్పులకు రూ. 30 వేల వంతున ప్రయోజనం అందిస్తారు. లేబర్‌కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొని ఏడాది పూర్తయితేనే ఈ సాయం అందుతుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే నామినికి రూ. 10 లక్షలు, సహజ మరణానికి రూ. 2 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ. 4 లక్షలు చొప్పన పరిహారం అందిస్తారు. ఒకవేళ ఏదైనా జబ్బుతో ఆసుపత్రిలో చేరి ఐదు రోజుల కంటే ఎక్కువ చికిత్స పొందితే నెలకు రూ. 4,500 వంతున 3 నెలలు చెల్లిస్తారు. కార్మికులకు సీఎస్సీ ద్వారా ఏడాదికి ఒక సారి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నైపుణ్యాల పెంపు కోసం న్యాక్ ద్వారా శిక్షణ కల్పించి ధ్రువీకరకణ పత్రాలు జారీ చేస్తారు. శిక్షణ సమయంలో స్టైఫండ్ అందిస్తారు.