Share News

kumaram bheem asifabad- అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగుతో ప్రయోజనం

ABN , Publish Date - Jul 02 , 2026 | 10:44 PM

అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తి సాగుతో రైతులకు ప్రయోజనం ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్‌ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో కపాస్‌ కాంతి పథకంలో భాగంగా గురువారం రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక అధిక సాంద్రత పద్ధతిని అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు.

kumaram bheem asifabad- అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగుతో ప్రయోజనం
బెజ్జూరులో రైతులకు పత్తి విత్తనాలు పంపిణీ చేస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్‌

బెజ్జూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తి సాగుతో రైతులకు ప్రయోజనం ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్‌ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో కపాస్‌ కాంతి పథకంలో భాగంగా గురువారం రైతులకు ఉచిత పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక అధిక సాంద్రత పద్ధతిని అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. సాధారణ పద్ధతి కంటే అధిక సాంద్రత పద్ధతిలో ఎకరాకు ఎక్కువ మొక్కలు నాటడం వల్ల దిగుబడి పెరుగుతుందని అన్నారు. సాగులో వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ రైతులు అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగరాజు, మొగవెల్లి సర్పంచ్‌ శంకర్‌, ఏఈవో పరిమళ తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): ఆధునిక అధిక సాంద్రతతో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకట్‌ అన్నారు. మండలంలోని బాలాజీఅనుకోడ రైతు వేదికలో గురువారం కపాస్‌ క్రాంతి పథకంలో భాగంగా రైతులకు మండల అధికారులతో కలిసి ఉచితంగా పత్తి విత్తన ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తుందని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పత్తి విత్తనాలను ఈ పద్ధతిలో సాధారణం కంటే ఎకరాకు ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా దిగుబడి గణనీయంగా పెరుగుతుందని అన్నారు. అధిక సాంద్రత పద్ధతి ప్రాముఖ్యతను వివరించారు. రైతులు పంటల సాగులో మెలుకువలు నేర్చుకోవాలని పత్తి విత్తనాలు విత్తే సమయం నుండి తెగుళ్ల నివారణకు సలహాలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కార్తేషా, ఏఈఓలు జ్ఞానేశ్వర్‌, సంపూర్ణ, శ్రీలత, మీన, సిద్దార్థ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 10:44 PM