kumaram bheem asifabad- ఏజెన్సీ మండలాల రైతులకు ప్రయోజనం
ABN , Publish Date - May 21 , 2026 | 10:12 PM
జైనూర్‌లో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో ఏజెన్సీ మండలాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ గోదాంలో మార్క్‌ఫెడ్ ఆద్వర్యంలో సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. వీటితో పాటు సాయిబాబా అగ్రో సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అంబలి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.
జైనూర్, మే, 21 (ఆంధ్రజ్యోతి): జైనూర్‌లో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో ఏజెన్సీ మండలాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ గోదాంలో మార్క్‌ఫెడ్ ఆద్వర్యంలో సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. వీటితో పాటు సాయిబాబా అగ్రో సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు అంబలి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుతో ఏజెన్సీ మండలాల రైతులకు ప్రయోజన కరంగా ఉందన్నారు. రైతులు పండించిన జొన్న పంట ఽముందుగా కొనుగోలు చేయాలని కోరారు. జొన్నల కొనుగోలులో ఆక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చైర్మన్లు కుడిమెత విశ్వనాథ్‌రావ్, కొడప హన్ను పటేల్, సీనియర్ నాయకులు శ్రీ రాంనాయక్, నాగర్‌గోజే విశ్వాంబర్ వైస్ ఎంపీపీలు చిర్లే లక్ష్మణ్, షేక్ రషీద్, మేస్రాం అంబాజీరావ్, డీసీసీ సభ్యులు పెందుర్ ప్రకాష్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్‌లాల, సర్పంచ్‌లు కొడప ప్రకాష్, ఆత్రం తులసీ, మడావి కౌసల్యాబాయి, మాజీ సర్పంచ్ మడావి భీంరావ్, సొనకాంబ్లే విశ్వనాథ్‌రావ్, ముండె సతీష్, బబృవాన్, సీఈవో సొనకాంబ్లే జనార్దన్, కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ మకీద్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి మాజీ సర్పంచులు మడావి నాగోరావ్, భీంరావ్ పాల్గొన్నారు.