Share News

kumaram bheem asifabad- ఉన్నత విద్యకు ఉపకారం

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:06 PM

ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు 12వ తరగతి అనంతరం ఉన్నత విద్యనభ్యసించేం దుకు ఆర్థిక సాయానికి కేంద్ర ప్రభుత్వం టాప్‌ క్లాస్‌ పథకం కింద ఉపకార వేతనాన్ని అందిస్తొంది. 2026-27 విద్యా సంవత్సరంలో దాదాపు 2000 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

kumaram bheem asifabad- ఉన్నత విద్యకు ఉపకారం
లోగో

- అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

వాంకిడి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు 12వ తరగతి అనంతరం ఉన్నత విద్యనభ్యసించేం దుకు ఆర్థిక సాయానికి కేంద్ర ప్రభుత్వం టాప్‌ క్లాస్‌ పథకం కింద ఉపకార వేతనాన్ని అందిస్తొంది. 2026-27 విద్యా సంవత్సరంలో దాదాపు 2000 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విద్యా ఖర్చులు పుస్తకాలు, స్టేషనరీ, ల్యాప్‌టాప్‌ తదితర అవసరాల కోసం మొదటి ఏడాదికి రూ. 86 వేలు చొప్పున అందిస్తారు. తర్వాత ప్రతి ఏడాదికి రూ. 41 వేలు చొప్పున అందిస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలో ట్యూషన్‌ ఫీజులతో పాటు ఇతర ఫీజులు కూడా పూర్తిగా చెల్లిస్తారు.

- అర్హతలు ఇలా..

ఎస్సీ కేటగిరీకి చెందిన విద్యార్థులై ఉండాలి. కుటుంబ వార్షికాదాయం అన్ని వనరులనుంచి రూ. 8 లక్షల వరకు ఉండా లి. గుర్తింపు పొందిన సంస్థలో రెగ్యులర్‌ కోర్సులో ప్రవేశపొంది ఉండాలి. మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 30 శాతం బాలికలకు కేటాయిస్తారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐఎం, ఎన్‌ఎల్‌యూలతో పాటు కేంద్ర, రాష్ట్ర గుర్తింపు కలిగిన ప్రముఖ సంస్థల్లో ప్రవేశాలు పొంది ఉండాలి. నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ (ఎన్‌ఎస్‌పీ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా, ప్రవేశ ర్యాంకు, ఫీజు వివరాలను పొందుపర్చాలి. ఒక కుంటుంలో గరిష్టంగా ఇద్దరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఇతర ఉపకార వేతనాలు పొందుతున్నవారు అనర్హులు. విద్యార్థి తదుపరి తరగతికి ప్రమో ట్‌ కాకపోతే ఉపకార వేతనం నిలిపివేస్తారు. అక్టోబరు 31 వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated Date - Sep 06 , 2026 | 11:06 PM