kumaram bheem asifabad- ‘బెల్ట్’ జోరు
ABN , Publish Date - Sep 04 , 2026 | 10:47 PM
జిల్లాలో బెల్టు దందా జోరుగా సాగుతోంది. నియం త్రించాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో బెల్టు దుకాణాలు నిర్వహించే వారు 24 గంటల పాటు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో అధికారికంగా 33 వైన్ షాపులు మాత్రమే ఉన్నాయి. కాగా అక్రమంగా రెండు వేల వరకు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు.
- లైసెన్స్ దుకాణాల నుంచి గ్రామాలకు యథేచ్ఛగా సరఫరా
చింతలమానేపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బెల్టు దందా జోరుగా సాగుతోంది. నియం త్రించాల్సిన సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో బెల్టు దుకాణాలు నిర్వహించే వారు 24 గంటల పాటు మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో అధికారికంగా 33 వైన్ షాపులు మాత్రమే ఉన్నాయి. కాగా అక్రమంగా రెండు వేల వరకు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు, పోలీసులు ముందస్తు సమాచారంతో అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఈ దందా మూడు పూవులు ఆరు కాయలు అన్నచందంలా మారింది. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై తీవ్ర విమర్శలు ఎదురవుతు న్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా బెల్టు షాపులను నియంత్రిస్తామని చెప్పినా ఇప్పటి వరకు వీటికి అడ్డుకట్ట వేయడం లేదని చెబుతున్నారు. చాలా కుటుంబాల్లో వివాదా లు, గొడవలకు మద్యం మత్తు కారణమవుతోంది.. పోలీస్‌స్టేషన్లకు వస్తున్న కేసుల్లో ఎక్కువ మద్యం మత్తులో జరిగిన సంఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. పచ్చని పల్లెల్లో బెల్ట్ షాపులు చిచ్చు పెడుతున్నాయి. అధికారులు మాములుగానే తీసుకుంటున్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం సైతం తెలంగాణకు దిగుమతులు జరుగుతున్నాయి. మహా రాష్ట్రలో దొరికే దేశీదారు మద్యాన్ని కొందరు అక్రమా ర్కులు దిగుమతి చేసుకొని రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో పలువురు పట్టుబడుతున్నప్పటికీ దందా ఆగడం లేదు. ఇటీవల కాగజ్‌నగర్ నజ్రూల్‌నగర్‌లో మహిళలు సైతం బెల్ట్ షాపులను ప్రోత్సహించకుండా బెల్ట్ షాపులు నిర్వ హించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రోడ్డె క్కారు.
- ఇష్టారీతిన..
లైసెన్స్ పొందిన మద్యం వ్యాపారులు ఇష్టారీతిన విక్రయాలు చెపడుతున్నారు. వారికి కేటాయించిన దుకాణాల ద్వారా జిల్లా వ్యాప్తంగా బెల్లు షాపులు నిర్వహించుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. బెల్టు దుకాణాలు నిర్వహించే నిర్వాహకులు నేరుగా వైన్స్‌ల నుంచే పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఆటోల్లో, ద్విచక్ర వాహనాలపై ఇతర మార్గాల ద్వారా సరఫరా చేసుకుంటున్నారు. ఓ వైపు గుడుంబా మానేసిన వారికి ప్రభుత్వం స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే మరో వైపు బెల్టు దుకాణాలు పల్లె. పట్టణ ప్రజలను మత్తులో ముంచెత్తున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా గ్రామాల్లో బెల్టు దుకా ణాలు సాగుతున్నా.. అధికారులు పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నా రన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. జిల్లాలోని కొందరు మద్యం దుకాణ యజ మానులు కమిషన్లకు బెల్టు దుకాణాలు నడిపిస్తున్నా రన్న ఆరోపణలున్నాయి. కానీ మరి కొందరు మాత్రం బెల్లు షాపులను ప్రోత్సహిస్తూ బెల్టు దందా చేసేవారికి మద్యాన్ని వాళ్ల ఒప్పందం మేరకు సరఫరా చేస్తూ విపరీతంగా మద్యం అమ్మేలా ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. 24 గంటల పాటు మద్యం బెల్లు షాపుల్లో అందుబాటులో ఉంటుం దని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.
- ఒక్కో గ్రామంలో పది వరకు..
ఒక్కో గ్రామంలో సుమారుగా పది షాపుల వరకు ఉంటాయి. ఇందులో రోజుకు ఒక్కో షాపులో సుమారు గా రూ. 5వేల నుంచి 10వేల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే 10 షాపులకు రూ. 50వేల నుంచి లక్ష వరకు ఒక్కో గ్రామంలోనే మద్యం అమ్మ కాలు జరుగుతున్నాయి. ఒక్కో గ్రామంలోనే రోజుకు రూ. లక్ష వరకు మద్యం అమ్మకాలు జరిగితే జిల్లా వ్యాప్తంగా బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నా యో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో 33 వైన్స్ షాపులు, మూడు రెస్టారెంట్ బార్లున్నాయి. 335 గ్రామ పంచాయతీలుండగా ఇందులో 300 వరకు అనుబం ధ గ్రామాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వెయ్యిపైనే బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బెల్టు దుకాణా ల్లో మద్యం బాటిళ్లను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించి సొమ్మ చేసుకుంటున్నారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ. 30 నుంచి 50 వరకు అధికంగా తీసుకుంటున్నారు. బీర్ల సీసాలపై సైతం ఒక్కో బాటి ల్‌పై రూ. 40 వరకు అదనంగా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బెల్టు దందా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.