పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:06 PM
జిల్లాలో మధ్యం ఏరులై పారుతోంది. అధికారు ల అలసత్వంతో రెచ్చిపోతున్న మద్యం మాఫి యా గల్లిగల్లికో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తోంది. మంచినీళ్లు దొరకని స్థలాలు ఉన్నాయంటే అతి శయోక్తికాదు గానీ, మద్యం దొరకని చోటంటూ లేకపోవడం గమనార్హం.
-వైన్ షాపులకు అనుబంధంగా ఏర్పాటు
-కిరాణా షాపుల్లో దర్శనమిస్తున్న అక్రమ నిల్వలు
-మామూళ్ల మత్తులో జోగుతున్న అబ్కారీశాఖ
మంచిర్యాల, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మధ్యం ఏరులై పారుతోంది. అధికారు ల అలసత్వంతో రెచ్చిపోతున్న మద్యం మాఫి యా గల్లిగల్లికో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తోంది. మంచినీళ్లు దొరకని స్థలాలు ఉన్నాయంటే అతి శయోక్తికాదు గానీ, మద్యం దొరకని చోటంటూ లేకపోవడం గమనార్హం. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావలసినంత మ ద్యం దొరుకుతోంది. వైన్, బార్ షాపుల్లో సమ యసారిణి ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్టు షాపుల్లో మాత్రం 24 గంటలు అందుబా టులో ఉంటోంది. ఎప్పుడంటే అప్పుడు....ఏ బ్రాం డ్ అంటే ఆ బ్రాండ్... వైన్ షాపుల మాదిరి ఇ ళ్లలోనే లభ్యం అవుతోంది. కిలో మీటర్లమేర వైన్ షాపులకు వెళ్లకుండానే ఐదో, పదో ఎక్కు విస్తే ఇంటి పక్కనే దొరుకుతుండటం కొసమెరుపు.
వైన్ షాపులకు అనుబంధంగా...
మధ్యం విక్రయాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో వైన్ షాపుల నిర్వా హకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో వైన్ షాపు పరిధిలో కనీసం 30 చొప్పున బెల్టు షాపులు అనుబంధంగా పని చేస్తున్నాయంటే అతిశయోక్తికాదు. తమ టార్గెట్లు చేరుకొనేందు కు బెల్టు షాపులను ఏర్పాటు చేయిస్తూ, అక్ర మంగా మధ్యం అమ్మకాలు సాగించేలా వైన్ షాపుల నిర్వాహకులే ప్రోత్సహిస్తున్నారన్న ఆరో పణలున్నాయి. వైన్ షాపుల నుంచి ఎమ్మార్పీ ఽధరలకు కొనుగోలు చేస్తున్న బెల్టు షాపుల ని ర్వాహకులు ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ. 20 అధనంగా వసూలు చేస్తూ అమ్మకాలు సాగి స్తున్నారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ఎక్కడ చూసినా ఒక్కో వీదిలో కనీసం 10 వర కు బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. బెల్టు షాపుల కారణంగా వాటికి అనుబంధంగా ఉన్న వైన్ షాపుల్లో గణనీయంగా మద్యం అమ్మకాలు నమోదవుతున్నాయి. పట్టణాల పరిధిలో ఉన్న ఒక్కో వైన్ షాపులో సగటున నిత్యం రూ. 5 ల క్షల వరకు అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోం ది. వినియోగదారులకు విక్రయిస్తున్న సరుకు కం టే బెల్టు షాపులకు తరలించే మద్యం వి లువే అధికంగా ఉంటుందని సమాచారం. పైగా బెల్టు షాపుల్లో మద్యం కల్తీ అవుతుందన్న ప్ర చారమూ ఉంది. లూజు అమ్మకాలు సాగిస్తుండ టంతో నీళ్లు లేదా తక్కువ విలువగల మధ్యం తో కల్తీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అక్రమంగా సిట్టింగ్‌లు ఏర్పాటు...
బెల్టు షాపులకు అనుగుణంగా సిట్టింగ్ పా యింట్లు ఏర్పాటు చేస్తూ మందుబాబులను ని ర్వాహకులు ఆకట్టుకుంటున్నారు. రెస్టారెంట్ మాదిరిగా అప్పటికప్పుడు ఆహార పదార్థాలు త యారు చేస్తూ నిర్వాహకులు అందజేస్తున్నారు. బెల్టు షాపుల్లోనూ పోటీ పెరగడంతో తమ క ష్టమర్లను ఆకర్శించేందుకు ఇళ్లలోనే ప్రత్యేక ఏ ర్పాట్లు చేస్తున్నారు. బెల్ట్ షాపుల కారణంగా భారీగా మద్యం విక్రయాలు నమోదవుతున్నా యి. గత నెలలో గతంలో ఎన్నడూ లేని విధం గా మద్యం విక్రయాలు నమోదుకావడమే విచ్చ లవిడి మద్యం అమ్మకాలకు నిదర్శనం. దసరా పండుగ సందర్భంగా కేవలం మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఏకంగా రూ.23.11 కోట్ల అమ్మ కాలు నమోదు కావడం గమనార్హం. బెల్టు షా పుల కారణంగా లైసెన్స్‌డ్ బార్లకు వెళ్లే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్ర తియేటా లక్షల రూపాయలు లైసెన్సు ఫీజుల రూపంలో బార్ అండ్ రెస్టారెంట్‌ల యాజమా న్యాలు చెల్లిస్తున్నప్పటికీ, వినియోగదారులు లేక వెలవెలబోతున్నాయి.
మామూళ్ల మత్తులో..
జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టు షాపులు ఏర్పాటవుతున్నప్పటికీ అబ్కారీశాఖ అ ధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. బెల్టు షాపుల నుంచి నెలవారీ మామూళ్లు అం దుకుంటూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నా రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం పెద్ద మొత్తంలో మద్యం వైన్ షాపుల నుంచి తరలి పోతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. అఽధి కారుల నిర్లిప్తత కారణంగా బెల్టు షాపుల్లో పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు ఉంటున్నాయి.