Share News

రాజకీయ కక్ష సాధింపు వల్లే ...

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:19 PM

ఢిల్లీలో ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపిన కాంగ్రెస్‌ అగ్రనేతలను రాజకీయ కక్ష సాధింపులో భాగం గానే అరెస్టు చేశారని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్‌కుమార్‌ అన్నారు.

రాజకీయ కక్ష సాధింపు వల్లే ...
కల్వకుర్తిలో ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- రాహుల్‌, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ కాంగ్రెస్‌ ధర్నా

కల్వకుర్తి, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : ఢిల్లీలో ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపిన కాంగ్రెస్‌ అగ్రనేతలను రాజకీయ కక్ష సాధింపులో భాగం గానే అరెస్టు చేశారని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్‌కుమార్‌ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కల్వకుర్తి పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కేం ద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరే కంగా పార్టీ నాయ కులు నినాదాలు చేస్తూ నిరస న తెలిపారు. ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన వ్యక్తం చేస్తు న్న ప్రతిపక్ష నాయకులపై చర్య లు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధ మని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయ త్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

తిమ్మాజిపేట, (ఆంధ్రజ్యోతి) : ఢిల్లీలో విద్యా ర్థులపై జరిగిన లాఠీచార్జికు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకురా లు దాచేపల్లి సారికరామ్మోహన్‌ కోరారు. ఢిల్లీలో రాహుల్‌గాందీని పోలీసులు అరెస్టు చేయడానికి నిరసనగా తిమ్మాజిపేటలో బుధవారం చేపట్టిన ధర్నాలో ఆమె మాట్లాడారు.

Updated Date - Jul 22 , 2026 | 11:19 PM