ప్రతీ బూత్‌లో అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:17 PM
ప్రతీ బూత్‌లో కార్య కర్తలు అప్రమత్తంగా ఉండి ఎస్‌ఐఆర్ ను పరిశీలించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ బూత్‌లో కార్య కర్తలు అప్రమత్తంగా ఉండి ఎస్‌ఐఆర్ ను పరిశీలించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పట్ట ణంలోని అంబేడ్కర్ భవనంలో ఐఎన్ టీయూసీ నాయకులు ఆయనను కలి శారు. ఆయన మాట్లాడుతూ ఐఎన్‌టీ యూసీ నాయకులు బూత్‌లలో తిరిగి మెంబర్‌షిప్ ఎక్కువశాతం అయ్యేవిధంగా కృషి చేయాలన్నారు. సర్ ఈనె 24న చివరి తేదీ ఉ న్నందున ప్రతీ ఒక్కరు బీఎల్‌వోల దగ్గర నుంచి ఫారాలు తీసుకొని వివరాలను జాగ్రత్త గా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐఎ న్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకు లు మహబూబ్ అలీ, మౌలానా, శ్రీరాం, భాస్క ర్,అనిల్, సలేశ్వరం,రాజు, మహేశ్ పాల్గొన్నారు.