Share News

దాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:29 PM

వరిధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలోఅధికారులతో సమావేశం నిర్వహించారు.

దాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : వరిధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలోఅధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి ధన్యాం కొనుగోలు చేస్తుందన్నారు. ధాన్యం క్వింటాలుకు గ్రేడ్‌ ఏ రకానికి రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 మద్దతు ధర నిర్ణయించిందన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాళుకు రూ. 500 బోనస్‌ అదనంగా అందించడం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయాలని, నిబంధనల ప్రకారం రైతులకు గోనె సంచులు ఇవ్వాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 2 ఎలక్ర్టానిక్‌ తూకం పరికరాలు, 30 టార్పాలిన్‌లు, 1 ప్యాడీ క్లీనర్‌ అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రాల నిర్వహకులు రిజిష్టర్‌ల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. తేమ శాతం 17 శాతం కంటే ఎక్కువ ఉంటే ధాన్యం ఆరబెట్టుకుని తేమ శాతం తగ్గిన తర్వాతనే ధాన్యం తీసుకుని రావాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారి జారీ చేసిన టోకెన్‌తో ఓపీఎంఎస్‌లో వివరాలు సరి చూసుకోవాలని, కౌతు రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా కౌలు రైతు ధృవీకరపత్రం పత్రం ఖచ్చితంగా సమర్పించాలన్నారు. ధాన్యం కొనుగోలను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరావు, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, డీఆర్‌డీవో కిషన్‌, లీడ్‌ డిస్ర్టిక్‌ మేనేజర్‌ తిరుపతి, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, మార్కెటింగ్‌ అధికారి షహుబుద్దీన్‌, జిల్లా రవాణా అధికారి సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 11:29 PM