kumaram bheem asifabad- మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
ABN , Publish Date - Jan 20 , 2026 | 10:26 PM
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవితో కలిసి మంగళవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహఙంచారు
ఆసిఫాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవితో కలిసి మంగళవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహఙంచారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికలలో వినియోగించే సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ ప్రింటింగ్‌కు అవసరమైన ఏరాపట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ప్లయింగ్, స్టాటిస్ట్రిక్ సర్వేయలెన్స్ బృందాలు, పీవో, ఓపీవోలకు శిక్షణ కల్పించాలని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, సామాగ్రి పంపిణీ కేంద్రం, స్వీకరణ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన బడ్జెట్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 28 పోలింగ్ కేంద్రాలు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు గాను 85 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహయ రిటర్నింగ్ అధికారులు, పీవోలు, ఓపీవోల నియామకం, శిక్షణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్‌లు గజానన్, రాజేందర్, పట్టణ ప్రణాళికాధికారి యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.