Share News

kumaram bheem asifabad- వేసవి సెలవుల్లో బడి ఆస్తులు జాగ్రత్త

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:08 PM

పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవుల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 23న చివరి పనిదినం సందర్భంగా 1-9 తరగతులు చదువుతున్న విద్యార్థుల ఫలితాలను ప్రకటించి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ప్రగతిపత్రాలను అందజేయాలి. జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉండటంతో జూన్‌ 12నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. వేసవిసెలవుల్లో బడి ఆస్తులు జాగ్రత్త అంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని అన్ని పరికరాలు, వస్తువులు, సెలవుల్లో జాగ్రత్తగా ఉండేలా ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

kumaram bheem asifabad-  వేసవి సెలవుల్లో బడి ఆస్తులు జాగ్రత్త
ప్రభుత్వ పాఠశాల

వాంకిడి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవుల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 23న చివరి పనిదినం సందర్భంగా 1-9 తరగతులు చదువుతున్న విద్యార్థుల ఫలితాలను ప్రకటించి తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ప్రగతిపత్రాలను అందజేయాలి. జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉండటంతో జూన్‌ 12నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. వేసవిసెలవుల్లో బడి ఆస్తులు జాగ్రత్త అంటూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్‌ నికోలస్‌ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని అన్ని పరికరాలు, వస్తువులు, సెలవుల్లో జాగ్రత్తగా ఉండేలా ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 1,275 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 908, ప్రాథమికోన్నత పాఠశాలలు 180, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 170, కేజీబీవీ పాఠశాలలు 15, మోడల్‌ స్కూల్స్‌ రెండు ఉన్నాయి. ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకు పాఠశాలలకు సెలవులు కావడంతో పాఠశాల ఆస్తులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని విద్యాశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.

- భద్రపరచాల్సిన సామగ్రి ఇదే....

ఫ విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కోసం సన్నబియ్యం సరఫరా చేస్తుంది. ఈ నెలలో మిగిలిపోయిన బియ్యాన్ని సెలవులు ముగిసే వరకు భద్రపర్చాలి.

ఫ సైన్స్‌ ప్రయోగశాలలు, అటల్‌ టింకరింగ్‌ ట్యాబ్‌ ఏటీఎల్‌ల్లో విలువైన వస్తువులు, పరికరాలు ఉన్నాయి. కంప్యూటర్‌ ప్రయోగశాల లు ఉండటంతో వాటిని జాగ్రత్తగా ఉంచడంపై శ్రద్ధ వహించాలి.

ఫ ఏటా క్రీడా పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. సెలవుల్లో క్రీడా సామగ్రిని జాగ్రత్తగా ఉంచాలి. అన్ని పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటుచేసి పలు పుస్తకాలను సరఫరా చేశారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలకు వివిధ రకాల వస్తు సామగ్రిని అందజేశారు. నీటి శుద్ధి పరికరాలు, నీటి పంపింగ్‌ కోసం అమర్చిన మోటార్లు దొంగలపాలు కాకుండా చూడాలి.

ఫ జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు డిజిటల్‌ పాఠ్యాంశాల కోసం ఒక్కో పాఠశాలకు మూడు తరగతుల్లో రూ. లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక పరికరాలు అమర్చారు. అన్ని పాఠశాలల్లో విలువైన ఫర్నీచర్‌ అందుబాటులో ఉంది. వేసవి సెలవుల్లో తరచుగా పాఠశాలల్లో కూడా చోరీలు జరుగుతుండటంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- రాత్రి కాపలాదారులను నియమించాలి...

ప్రభుత్వ పాఠశాలల్లో రాత్రి కాపలదారులు నైట్‌వాచ్‌మన్‌ లేకపోవడంతో పర్యవేక్షణ చేయడం ఇబ్బందిగా మారిందని ప్రధానోపాఽధ్యాయులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో విలువైన సామగ్రిని భద్రపర్చుకోవడానికి రాత్రికాపలాదారులను నియమించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. వేసవి సెలవులు ముగిసే వరకు పాఠశాలలకు తాత్కాలిక ప్రాతిపదికన నైట్‌వాచ్‌మన్‌లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరుతున్నారు.

Updated Date - Apr 24 , 2026 | 11:08 PM